వెనక్కు తగ్గిన ఇరాన్.. భారత నౌకను టచ్ చేస్తే వణుకు పుట్టేలా..!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్ జెండా కలిగిన చమురు నౌక 'దేశ్ గరిమ' హార్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. ఏప్రిల్ 18 శనివారం ఈ ఆయిల్ ట్యాంకర్ హార్మూజ్ జలసంధని దాటింది. ఈ నౌకలోని 31 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ముడి చమురుతో భారత్ వైపునకు వస్తున్న ఈ ట్యాంకర్ ఏప్రిల్ 22 న ముంబై పోర్టుకు చేరుకోనున్నట్లు అధికారులు ధ్రువీకరించారు.
భారత సముద్రయానానికి ఇది శుభవార్త అని చెప్పొచ్చు. భారత జెండాగల క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ 'దేశ్ గరిమ' శనివారం నాడు ఉద్రిక్తతల మధ్య హార్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటింది. ప్రస్తుతం భారత్ వైపు ప్రయాణిస్తోంది. 31 మంది భారతీయ నావికులతో కూడిన ఈ నౌక 2026 ఏప్రిల్ 22న ముంబై పోర్టుకు చేరుకుంటుందని అంచనా. షిప్పింగ్ అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రయాణం పూర్తయిందని ధృవీకరించారు. ఆ ప్రాంతంలో పెరిగిన భద్రతా ఆందోళనల మధ్య ఇది సిబ్బంది కుటుంబాలకు గొప్ప ఉపశమనాన్నిచ్చింది.
అయితే, 'దేశ్ గరిమ' సురక్షిత ప్రయాణం హార్ముజ్ జలసంధిలో కొత్త భద్రతా సవాళ్ల నేపథ్యంలో జరిగింది. గత 24 గంటల్లో, మరో రెండు భారతీయ నౌకలైన VLCC 'సమ్నార్ హెరాడ్', బల్క్ క్యారియర్ 'జగ్ ఆర్నవ్' ఈ వ్యూహాత్మక జలమార్గంలో ప్రయాణించే ప్రయత్నంలో కాల్పుల ఘటనను ఎదుర్కొన్నాయి. రెండు ఓడలు వెంటనే వెనక్కి తిరిగి వెళ్లాయి. భద్రత కోసం పర్షియన్ గల్ఫ్ కు చేరుకున్నాయి.
ప్రపంచ చమురు వాణిజ్యానికి కీలకమైన హార్ముజ్ జలసంధిలో, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ఇటీవల సముద్రయాన ప్రమాదాలు పెరిగాయి. భారత షిప్పింగ్ సంస్థలు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ, నౌకలు జాగ్రత్త వహించాలని, మెరుగైన భద్రతా ప్రోటోకాల్ లను పాటించాలని సూచిస్తున్నాయి.

ఇక ఇటీవల హార్మూజ్ జలసంధిని దాటిన భారత జెండాలు కలిగిన రెండు నౌకలను ఇరాన్ కు చెందిన గన్ బోట్స్ కాల్చేసిన విషయం తెలిసిందే. భారత నౌకలపై దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ వైఖరి పట్ల తీవ్ర ఆందోళన, నిరసన వ్యక్తం చేసింది. దాంతో భారత నౌకల విషయంలో ఇరాన్ వెనక్కు తగ్గినట్లు స్పష్టం అవుతోంది.












Click it and Unblock the Notifications