"థాంక్యూ ఇండియా" అని రాసి మరీ.. ఇజ్రాయిల్‌‌ పై ఇరాన్ అటాక్ !!

పశ్చిమాసియా ప్రాంతంలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ మరింత తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ తాజాగా నిర్వహించిన క్షిపణి దాడులు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ దాడుల్లో ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది-ఇజ్రాయెల్‌పై ప్రయోగించిన కొన్ని క్షిపణులపై "థాంక్యూ టు పీపుల్ ఆఫ్ ఇండియా" అనే సందేశాలు కనిపించడం. ఇదే కాకుండా స్పెయిన్, పాకిస్తాన్, జర్మనీ దేశాల ప్రజలకు కూడా ఇలాంటి కృతజ్ఞతా సందేశాలు రాసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఆధ్వర్యంలో జరిగిన తాజా దాడులు ఈ ఘర్షణలో కీలక మలుపుగా భావిస్తున్నారు. శుక్రవారం జరిగిన ఈ దాడుల్లో దీర్ఘ శ్రేణి, మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణులతో పాటు డ్రోన్‌లను విస్తృతంగా వినియోగించినట్లు సమాచారం.

iran-attack-on-israel-with-missiles-and-drones-and-make-note-to-thanks-to-people-of-india-goes-viral

ఇజ్రాయెల్‌లోని పలు వ్యూహాత్మక ప్రాంతాలు, అలాగే గల్ఫ్ ప్రాంతంలో అమెరికా మిత్రదేశాలకు చెందిన సైనిక స్థావరాలు కూడా లక్ష్యాలుగా గుర్తించబడ్డాయి. ముఖ్యంగా బహ్రెయిన్‌లో ఉన్న అమెరికా ప్యాట్రియట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నిర్వహణ కేంద్రం కూడా టార్గెట్‌గా ఉందని ఇరాన్ వర్గాలు పేర్కొన్నాయి.

ఇరాన్ క్షిపణులపై రాసిన "థాంక్యూ ఇండియా" వంటి సందేశాలు ప్రస్తుతం పెద్ద చర్చకు దారి తీసాయి. ముంబైలోని ఇరాన్ కాన్సులేట్, అలాగే ఇరాన్ అధికారిక వర్గాలు విడుదల చేసిన ఫోటోలలో, క్షిపణులపై నీలిరంగు మార్కర్లతో ఈ సందేశాలు రాస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఇది కేవలం ప్రచార కార్యక్రమం మాత్రమే కాకుండా, తమకు మద్దతు తెలిపిన దేశాల ప్రజలకు కృతజ్ఞత తెలియజేయడమేనని ఇరాన్ భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా భారత్‌ను "స్నేహపూర్వక దేశం"గా పేర్కొంటూ, ద్వైపాక్షిక సంబంధాల ప్రాధాన్యతను ఇరాన్ మరోసారి వెల్లడించింది.

హార్ముజ్ జలసంధి ఓపెన్...

ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా ఇరాన్ ఒక కీలక ప్రకటన చేసింది. భారత్ సహా స్నేహపూర్వక దేశాలకు హార్ముజ్ జలసంధి గుండా రవాణాకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గాన్ని ఓపెన్‌గా ఉంచడం భారత్ వంటి దేశాలకు ఆర్థికపరంగా చాలా ముఖ్యమైన విషయం. ఇది ఇరాన్-భారత్ సంబంధాల వ్యూహాత్మక ప్రాముఖ్యతను మరోసారి స్పష్టం చేస్తోంది.

కాశ్మీర్‌లో సంఘీభావం... ప్రజల విరాళాలు

ఇదిలా ఉండగా, జమ్మూ కాశ్మీర్‌లోని షియా వర్గానికి చెందిన ప్రజలు ఇరాన్‌కు తమ మద్దతు ప్రకటించారు. రాంబన్ జిల్లా చందర్‌కోట్, బుద్గామ్ వంటి ప్రాంతాల్లో వందలాది మంది ప్రజలు గుమికూడి, యుద్ధ బాధితులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. నగదు, గృహోపకరణాలు, బంగారం, వెండి ఆభరణాలు మాత్రమే కాకుండా పిల్లల పిగ్గీ బ్యాంక్‌లోని డబ్బు, పశువులు కూడా విరాళంగా ఇచ్చారు. ఈ సంఘటనపై ఇరాన్ భావోద్వేగ స్పందన వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపింది.

ఇక ఇజ్రాయెల్‌పై మాత్రమే కాకుండా, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిత్రదేశాలైన యూఏఈ, బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా వంటి దేశాలపై కూడా ఇరాన్ దాడులు విస్తరిస్తున్నట్లు సమాచారం. దీంతో మొత్తం పశ్చిమాసియా ప్రాంతంలో భద్రతా పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మొదట్లో ఇరాన్ త్వరగా వెనక్కి తగ్గుతుందని భావించినప్పటికీ, ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా మారింది. ఇరాన్ మరింత దూకుడుగా ప్రతిస్పందిస్తూ, తన సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది. అంతర్జాతీయ సమాజం ఈ ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని పిలుపునిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+