"మునక్కాయ రసం" ఇదొక్కటి యాడ్ చేస్తే సూపర్ టేస్ట్..!
మునక్కాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. మునక్కాయలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాగే మునక్కాయను రకరకాలుగా చేసుకుంటారు. ఇక మునక్కాయ రసం చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్ లో మునక్కాయ రసం చాలా మంది చేసుకుంటారు. అయితే ఈ మునక్కాయ రసాన్ని మరింత టేస్టీగా తయారు చేసుకోవడానికి ఏం పదార్థాలు కావాలి..? తయారీ విధానం ఏంటి..? పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..
మునక్కాయలు రెండు, కందిపప్పు ఒక టేబుల్ స్పూన్, టమాటోలు రెండు చిన్న ముక్కలు, చింతపండు ఉసిరికాయ సైజంత, రసం పొడికి, ధనియాలు ఒక టేబుల్ స్పూన్, మిరియాలు అర టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి రెండు నుంచి నాలుగు, ఎండుమిర్చి రెండు నుంచి నాలుగు, వెల్లుల్లి ఐదు రెబ్బలు, పసుపు పావు టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, బెల్లం అర టేబుల్ నుంచి ఒక టేబుల్ స్పూన్, నూనె లేదా నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు, తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర తీసుకోవాలి.

మునక్కాయ రసం తయారీ విధానం చూస్తే ముందుగా మునక్కాయలను ఉడికించుకోవాలి. ఆ తర్వాత రసం పొడిని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో పప్పు అలాగే చింతపండు కలుపుకోవాలి. ఆ తర్వాత మునక్కాయ రసాన్ని మరిగించుకోవాలి. ఇప్పుడు ఆ రసాన్ని తాలింపు పెట్టుకోవాలి. అంతే ఘుమఘుమలాడే సూపర్ టేస్టీ మునక్కాయ రసం తయరు అయినట్టే.. మీరు ఇలా తయారు చేసుకోండి.












Click it and Unblock the Notifications