కుజుడి సంచారంతో ఈ రాశులవారికి సొంత ఇంటి యోగం!

2026 మే 11న కుజుడు తన స్వగృహమైన మేష రాశిలోకి ప్రవేశించాడు. ఈ స్వస్థాన సంచారం కొన్ని రాశుల వారికి ఆస్తి, స్థిరాస్తులు మరియు సొంత ఇంటి యోగాలను బలపరుస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మేషం, మిథునం, కర్కాటకం, తుల, మకరం, మీనం రాశుల వారు జూన్ 20లోగా గృహ సంబంధిత శుభ ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది.

కుజుడి స్వస్థాన సంచారం వల్ల ఆస్తి లాభాలు

కుజుడు ఆర్థిక స్థిరత్వం, ధైర్యం వంటి వాటికి కారకుడు. అతని స్వస్థాన సంచారం వల్ల ఆస్తి లాభాలు, భూమి సంపాదన, ఇల్లు కట్టడం లేదా కొనుగోలు చేయడం వంటి యోగాలు ఏర్పడతాయని జ్యోతిష్యం చెబుతోంది. ఈ కాలంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, దీర్ఘకాలిక స్థిరాస్తి సంపాదనకు మార్గాలు పెరుగుతాయి.

Mars Transit into aries gives Luck For 6 Zodiac Signs know which zodiacs will gain new property

మేషం:

మేషరాశిలో కుజుడు రాశ్యాధిపతి స్వస్థానంలో ఉండటం వల్ల సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఖరీదైన ప్రాంతంలో స్థలం కొనుగోలు చేసే అవకాశం లేదా ప్రభుత్వం నుంచి ఇల్లు లభించే యోగం కనిపిస్తోంది.

మిథునం:

మిదునరాశిలో లాభ స్థానంలో కుజుడి ప్రభావం వల్ల వారసత్వ ఆస్తి లభించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తండ్రి వైపు నుంచి భూమి లేదా ఆస్తి లాభం ఉండవచ్చు. కోరుకున్న ప్రాంతంలో ఫ్లాట్ లేదా ఇల్లు అమరే అవకాశం ఉంది. ఇది మిధునరాశి వారికి మేలు చేకూరుస్తుంది.

కర్కాటకం:

కర్కాటక రాశిలో దశమ స్థానంలో కుజుడు ఉండటం వల్ల కర్కాటక రాశి జాతకులకు సంపదలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ లాభాలు వస్తాయి. ఉద్యోగ సంస్థ ద్వారా గృహ సౌకర్యం లేదా ప్రభుత్వ సహాయం ద్వారా ఆస్తి లాభం పొందే అవకాశం ఉంది.

తుల:

తులా రాశి జాతకులకు కుజ సంచారం కారణంగా జీవిత భాగస్వామి వైపు నుంచి ఆకస్మిక ఆస్తి లేదా ఇంటి యోగం కలగవచ్చు. కుటుంబ సభ్యుల సహాయంతో స్వంత ఇంటి కల నెరవేరుతుంది. ఆస్తుల విలువ పెరిగే అవకాశం ఉంది. ఇది వీరికి చాలా మంచి సమయం.

మకరం:

మకర రాశిలో నాలుగవ స్థానంలో కుజుడి సంచారం వల్ల గృహ, వాహన, ఆస్తి సంబంధిత యోగాలు బలపడతాయి. తల్లి వైపు నుంచి ఆస్తి లాభం లేదా ఆస్తి వివాదాలు అనుకూలంగా ముగిసే సూచనలున్నాయి. ఇది మకర రాశి వారికి అనుకూల సమయం.

శని అనుగ్రహంతో మే 15 తర్వాత ఈ రాశుల వారికి తిరుగుండదు!
శని అనుగ్రహంతో మే 15 తర్వాత ఈ రాశుల వారికి తిరుగుండదు!

మీనం:

మీనరాశి జాతకుల ధన స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఆస్తి వృద్ధి, ఆర్థిక సహాయం లభించి గృహ యోగం ఏర్పడుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఇది మీనరాశి వారికి సంపదలను, విలాసాలను ఇచ్చే కాలం. జ్యోతిష్య నిపుణులు ఈ కాలంలో శుభకార్యాలు, ఆస్తి సంబంధిత నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమని సూచిస్తున్నారు.

గమనిక : ఇవి జ్యోతిష్య నిపుణుల అంచనాలు, ఇంటర్నెట్ లో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడింది. దీని ఖచ్చితత్వం లేదా శాస్త్రీయతకు ఎలాంటి హామీ లేదు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణులను సంప్రదించడం శ్రేయస్కరం.గ్రహ ఫలితాలు వ్యక్తిగత జాతకం మీద కూడా ఆధారపడతాయని గుర్తించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+