పాకిస్థాన్ గాలి తీసిన ఇరాన్.. ఎగిరెగిరిపడిన ఆ దేశానికి సడెన్ షాక్..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్ధం ఏమాత్రం తగ్గడం లేదు. మరికొన్ని రోజులపాటు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ వైమానిక దాడులకు పాల్పడిన అమెరికా.. ఇప్పుడు భూతల దాడులకూ సిద్ధం అవుతోంది. ఈమేరకు అదనపు బలగాలను పశ్చిమాసియాకు తరలిస్తోంది. ఇదిలా ఉంటే ఇరాన్- అమెరికా మధ్య సంధి చర్చలను జరిపేందుకు పాకిస్థాన్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే పాకిస్థాన్ కు ఇరాన్ సడెన్ షాక్ ఇచ్చింది. ఈ మేరకు పాకిస్థాన్ ఆధ్వర్యంలో అమెరికాతో జరగాల్సిన చర్చలకు నో చెప్పింది. అమెరికా తమ ముందు ఉంచిన డిమాండ్స్ ఆమోదయోగ్యంగా లేవని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఇదే విషయంపై ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. అమెరికాతో డైరెక్ట్ గా చర్చలను తిరస్కరిస్తూ ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. భవిష్యత్తులోనూ అమెరికాతో చర్చలకు తాము సిద్ధంగా లేమని తేల్చి చెప్పింది ఇరాన్.
ఇరాన్- అమెరికా యుద్ధంపై పాకిస్థాన్ సంధి చర్చలకు సిద్ధం అవుతున్నప్పటికీ అందులో ఇరాన్ ప్రమేయం ఏమీ లేదని కాన్సులేట్ స్పష్టం చేసింది. పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని కానీ ప్రస్తుత పరిస్థితులకు గల కారణం ఎవరో గుర్తుంచుకోవాలని పరోక్షంగా అమెరికాపై కీలక వ్యాఖ్యలు చేసింది ముంబైలోని ఇరాన్ కాన్సులేట్. ఇరాన్- అమెరికా మధ్య ఇప్పటివరకూ జరిపినవి అన్నీ మధ్యవర్తుల మధ్యే జరిగాయని ఇరాన్ ప్రత్యక్షంగా ఈ చర్చల్లో పాల్గొనలేదని తెలిపింది.

ఇక ఇజ్రాయెల్ లోని హైఫా నగరంలో ఉన్న ఆయిర్ రిఫైనరీలపై ఇరాన్ మరోసారి దాడులకు పాల్పడింది. దాంతో అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇజ్రాయెల్ ఫైర్ సిబ్బంది కొన్ని గంటలపాటు శ్రమించి మంటలు అదుపు చేసింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ కు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్.. చర్చలకు రాకపోతే, హార్మూజ్ జలసంధిని తెరవకపోతే ఖార్గ్ ఐలాండ్స్ తో పాటు ఎనర్జీ కేంద్రాలు, ఆయిర్ రిఫైనరీస్ పై దాడులు చేసి వాటిని పేల్చేస్తామని ట్రంప్ సంచలన వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు.












Click it and Unblock the Notifications