US-Iran: ట్రంప్ సీజ్ ఫైర్ వెనుక ? తోసిపుచ్చిన ఇరాన్..!

ఇరాన్ (Iran)తో రెండు వారాల పాటు కుదుర్చుకున్న సీజ్ ఫైర్ ఒప్పందం గడువు ముగిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీజ్ ఫైర్ ఒప్పందం గడువు ముగిసేలోగా చర్చలకు వచ్చి ఫలితం తేల్చకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించిన ట్రంప్.. చివరి నిమిషంలో తోకముడిచారు. సీజ్ ఫైర్ నిరవధికంగా పొడిగించడంతో పాటు పాకిస్తాన్ లో జరగాల్సిన చర్చల్ని కూడా వాయిదా వేసేశారు. హార్ముజ్ దిగ్బంధం మాత్రం కొనసాగుతుందని ప్రకటించారు. దీన్ని ఇరాన్ తోసిపుచ్చింది.

సీజ్ ఫైర్ పొడిగిస్తున్నట్లు ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది. ఈ మేరకు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబాఫ్ సలహాదారు మహదీ మొహమ్మదీ ఎక్స్ లో స్పందించారు. ట్రంప్ కాల్పుల విరమణ పొడిగింపుకు అర్థం లేదని ఆయన తెలిపాకు. ఓడిపోతున్న పక్షం షరతులను నిర్దేశించలేదన్నారు. ముట్టడి కొనసాగింపు బాంబు దాడికి ఏమాత్రం భిన్నం కాదని, దానికి సైనిక ప్రతిస్పందన తప్పనిసరి అని స్పష్టం చేశారు. అంతేకాక, ట్రంప్ కాల్పుల విరమణ పొడిగింపు అనేది ఆకస్మిక దాడికి సమయం సంపాదించుకోవడానికి పన్నిన ఒక ఎత్తుగడ అని స్పష్టమవుతోందని మొహమ్మదీ తెలిపారు. ఇరాన్ చొరవ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

Iran Rejects Trump s Ceasefire Extension warns of military response to counter hormuz blockade

మరోవైపు పాకిస్థాన్‌లో జరగాల్సిన కాల్పుల విరమణ చర్చలు కార్యరూపం దాల్చడంలో విఫలమైన నేపథ్యంలో, ఇరాన్ హార్ముజ్ జలసంధిలో ఒక కంటైనర్ నౌకపై కాల్పులు జరిపి, ఆ నౌకను దెబ్బతీసి, పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. ఇరాన్ నుంచి ఏకీకృత ప్రతిపాదన కోసం ఎదురుచూస్తూ అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణను ట్రంప్ నిరవధికంగా పొడిగించిన కొన్ని గంటల తర్వాత ఈ ఘటన జరిగింది.అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఉదయం 7:55 గంటల ప్రాంతంలో ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వైరల్ జలమార్గాల్లో కంటైనర్ షిప్‌పై దాడి చేసిందని బ్రిటిష్ సైన్యానికి చెందిన యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) కేంద్రం తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+