యూఎస్ తో తలపడుతున్న ఇరాన్ బలాలేంటి? యుద్ధంలో ఎందుకు వెనక్కి తగ్గడం లేదు?

అత్యంత చిన్నదేశం అయిన ఇరాన్ అగ్రరాజ్యంతో యుద్ధంలో వెనక్కు ఎందుకు తగ్గటం లేదు? యూ ఎస్ తో తలపడాలంటే దాదాపు చాలా దేశాలు భయపడే పరిస్థితులు ఉన్నా శక్తివంతమైన యూఎస్ తో ఇరాన్ తలబడటం వెనుక దానికి ఉన్న శక్తి ఏంటి? ఇప్పుడు ప్రపంచం దృష్టి నిలిపేలా చేస్తున్న ఇరాన్ బలాలు ఏంటి? తెలుసుకుందాం.

భౌగోళిక ప్రాధాన్యం

ఇరాన్ భౌగోళికంగా అత్యంత కీలక ప్రాంతంలో ఉంది. ప్రపంచ చమురు రవాణాకు ప్రధానమైన హోర్ముజ్ జలసంధి దాని నియంత్రణలో ఉంటుంది. యుద్ధ సమయంలో దీన్ని మూసేస్తే గ్లోబల్ ఎకానమీపై తీవ్ర ప్రభావం పడుతుంది. అలాగే అక్కడి పర్వతాలు సైతం ఇరాన్ కు సహజ రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఇది ఇరాన్ కు ఒక అతి పెద్ద బలంగా మారింది.

Iran vs USA Why Iran Is Not Backing Down what are the strengths behind iran fight against USA

మిస్సైల్ శక్తి & డ్రోన్ టెక్నాలజీ

ఇరాన్ అంతర్జాతీయ ఆంక్షల మధ్య కూడా స్వంత మిస్సైల్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఇరాన్ వద్ద శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణులు, తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం చేసే కామికేజ్ డ్రోన్లు ఉన్నాయి. ఇవి వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఖచ్చితంగా దాడి చేసే సామర్ధ్యం ఉన్నవి కావటం కూడా ఇరాన్ కు ఒక బలం .

సిద్ధాంత బలం మరియు ఇరానీయుల పట్టుదల

అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలను ఇరాన్ దశాబ్దాలుగా తట్టుకుంటోంది. పశ్చిమ ఆధిపత్యాన్ని అంగీకరించకూడదనే బలమైన సిద్ధాంతం అక్కడి నాయకత్వంలో ఉంది. ఈ భావజాలం వల్ల ఎన్ని ఒత్తిడులు వచ్చినా వెనక్కి తగ్గకుండా నిలబడే ధైర్యం ఇరాన్‌కు లభించింది. ఇది ఇరానీయుల సిద్ధాంత బలానికి పట్టుదలకు తార్కాణం.

అణు సామర్ధ్యం ఉన్న దేశంగా

ఇరాన్ వద్ద ప్రస్తుతం అణుబాంబు లేకపోయినా, యురేనియం ఎన్‌రిచ్‌మెంట్ టెక్నాలజీలో అది ముందుంది. అవసరమైతే అణు ఆయుధాన్ని తయారు చేయగలదనే సంకేతాలు ఇస్తూ ఉంటుంది. ఈ న్యూక్లియర్ భయం అమెరికాను నేరుగా యుద్ధానికి వెళ్లకుండా ఆపుతోంది.అణు సామర్ధ్యం ఉన్న దేశం కావటం కూడా ఇరాన్ కు ఒక పెద్ద బలంగా చెప్పొచ్చు.

ప్రాక్సీ నెట్‌వర్క్ బలం ఇరాన్ కు పెద్ద బలం

ఇరాన్ తన ప్రభావాన్ని మధ్యప్రాచ్యం అంతటా విస్తరించింది. లెబనాన్, యెమెన్, ఇరాక్ వంటి ప్రాంతాల్లో మిత్ర దళాలను ఏర్పరచింది. అమెరికా ఇరాన్‌పై దాడి చేయాలంటే ముందుగా ఈ మిత్ర బలగాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.అమెరికా యుద్ధానికి భారీ ఖర్చుతో సైన్యాన్ని వినియోగించాలి. కానీ ఇరాన్ చిన్న డ్రోన్లు, క్షిపణులు మరియు ప్రాక్సీ గ్రూపులతో నిరంతరం ఒత్తిడి తెస్తుంది. ఈ అసమాన యుద్ధ వ్యూహం వల్ల ఇరాన్ తక్కువ వనరులతో అమెరికా వంటి పెద్ద శక్తిని సవాలు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+