బాధితులను బెదిరించలేదని హనుమాన్ గుడిలో బండి సంజయ్ ప్రమాణం చేస్తారా?

తెలంగాణా రాజకీయాలలో బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. బండి భగీరథ్ పోక్సో కేసు విషయంలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెద్ద పార్టీల నాయకులు బండి సంజయ్ ను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

బండి సంజయ్ ప్రమాణం చెయ్యాలన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఈ కేసులో బాధితులను ఎలాంటి బెదిరింపులకు గురి చేయలేదని బండి సంజయ్ హనుమాన్ ఆలయంలో తడి బట్టలతో ప్రమాణం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిజమైన హనుమాన్ భక్తుడైతే తన కుమారుడిని వెంటనే పోలీసులకు అప్పగించాలని కూడా సూచించారు. గత కొన్ని రోజులుగా ఈ కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.

bandi bhageerath pocso case rs praveen kumar targets union minister bandi sanjay to take holy oath

బాధిత అమ్మాయి తల్లిని బెదిరించలేదని ప్రమాణం చెయ్

తాజాగా ఆయన ఒక వీడియో విడుదల చేసి, దీర్ఘ ట్వీట్ ద్వారా తన అభిప్రాయాలను చెప్పిన ఆయన. "బాధిత అమ్మాయి తల్లిని బెదిరించలేదని హనుమాన్ గుడిలో తడిబట్టలతో వచ్చి బండి సంజయ్ ప్రమాణం చేయాలి అని డిమాండ్ చేశారు. హనుమాన్ భక్తిని ప్రస్తావిస్తూ ప్రవీణ్ కుమార్ మరిన్ని సూటి ప్రశ్నలు వేశారు.

నీ కొడుకు ఏం చేస్తున్నాడో నీకు తెలుసా

సోమవారం నుంచి ఆదివారం వరకు ఏ దేవుడిని పూజిస్తారో చెప్పే సంజయ్, తన కుమారుడు ఏ రోజుల్లో ఎక్కడ తిరుగుతాడు, ఎవరిపై ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడతాడు, ఏ పబ్‌లు, హుక్కా సెంటర్లలో సమయం గడుపుతాడు అనేది చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్, ఆయన కుమారుడు ఎప్పుడైనా హనుమాన్ మాల ధరించారా? హనుమాన్ చాలీసా చదివారా? అని నిలదీశారు.

హనుమాన్ ఆదర్శాలను చెప్పి, బండి సంజయ్ కొడుకును టార్గెట్ చేసిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

ప్రవీణ్ కుమార్ తన వ్యాఖ్యల్లో హనుమాన్ స్వామి ఆదర్శాలను గుర్తు చేశారు. సీతమ్మ కోసం లంకను దహనం చేసిన ఆంజనేయుడు, పరాయిస్త్రీని కన్నెత్తి చూడని ఆదర్శ పురుషుడు, జీవితాంతం బ్రహ్మచర్యం పాటించిన మహానుభావుడు అని వివరించారు. కానీ బండి సంజయ్ కుమారుడు మైనర్ అమ్మాయిపై అత్యాచారం చేసి ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నాడని ప్రశ్నించారు. మరోవైపు, సాధారణ ప్రజలు కాలినడకన పాదయాత్రలు చేస్తుంటే, సంజయ్ కుమారుడు బెంజ్ కార్లలో ఎందుకు తిరుగుతున్నాడన్నారు.

ఒక జ్యోతిష్యుడికి ఓఎస్డీ పదవి ఎందుకు? విజయ్ కు కాంగ్రెస్ ఎంపీ సూటిప్రశ్న!
ఒక జ్యోతిష్యుడికి ఓఎస్డీ పదవి ఎందుకు? విజయ్ కు కాంగ్రెస్ ఎంపీ సూటిప్రశ్న!

తప్పు చేసిన హిందువును ప్రశ్నించాలని ట్వీట్

హిందువుగా గర్వపడాలి, హిందువుగా జీవించాలి, కానీ తప్పు చేసిన హిందువును ప్రశ్నించాలని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. బండి భగీరథ్ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. బాధితుల ఆరోపణలు, కుటుంబాల స్థితి, రాజకీయ నాయకుల బాధ్యతలు అన్నీ ఈ కేసులో కీలకమవుతున్నాయి. తాజాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలతో ఈ కేసు ముందు ముందు ఏ మలుపు తిరుగుతుంది అన్నది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+