పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా పాకిస్థాన్ అట్టుడుకి పోయింది. ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేయడంతో చమురు, గ్యాస్ సంక్షోభం కారణంగా ఆ దేశంలో లాక్ డౌన్ విధించారు. రాత్రి 8 గంటల వరకే షాపులు, మార్కెట్లు తెరిచి ఉంటాయని ఆ తర్వాత మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. అంతేకాక పాకిస్థాన్ లోని పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ఇచ్చారు. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
అయితే పాకిస్థాన్ కు చెందిన ఓ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పాకిస్థాన్ కు చెందిన ఫాస్టెస్ట్ ట్రైన్ అయిన కారకొరం ఎక్స్ ప్రెస్ కు భారత్ లోనే అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు లింకు పెడుతూ నెటిజన్లు పలు పోస్టులు పెడుతున్నారు. పాకిస్థాన్ లో అత్యంత వేగంగా ప్రయాణించే రైలుగా కారకొరం ఎక్స్ ప్రెస్ కు పేరుంది. అయితే ఈ రైలు వేగం మాత్రం కేవలం 105 కిలోమీటర్లు మాత్రమే కావడం గమనార్హం.
మరోవైపు భారత్ లో సెమీ హై స్పీడ్ రైలు అయిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. వందేభారత్ తో పోల్చితే పాకిస్థాన్ కు చెందిన కారకొరం ఎక్స్ ప్రెస్ చాలా వెనకబడి ఉన్నట్లు నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. దాంతో పాకిస్థాన్, భారత్ మధ్య మౌలిక సదుపాయాల మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. అలాగే పాకిస్థాన్ లోని ఫాస్టెస్ట్ రైలు కంటే రాజధాని ఎక్స్ ప్రెస్, శతాబ్ది ఎక్స్ ప్రెస్ వంటి రైళ్లు చాలా బెటర్ అని కామెంట్స్ పెడుతున్నారు.

పాకిస్థాన్ లోని అనేక రైళ్ల కంటే భారత్ రైల్వే నెట్ వర్క్ చాలా విస్తృతమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ నెట్ వర్క్ లో భారతీయ రైల్వే వ్యవస్థ మొదటి మూడు స్థానాల్లో ఉంటుంది. అలాగే పాకిస్థాన్, భారత్ మధ్య రైల్వే మౌలిక సదుపాయాలు, సాంకేతిక అభివృద్ధిలో చాలా తేడా ఉంది. భారత్ ప్రస్తుతం మోస్ట్ అడ్వాన్స్ డ్ సెమీ హై స్పీడ్ రైళ్ల వైపు అడుగులు వేస్తోంది. అయితే పాకిస్థాన్ మాత్రం అందుకు భిన్నంగా పాతకాలపు సంప్రదాయ రైల్వే వ్యవస్థపైనే ఆధారపడుతోంది.












Click it and Unblock the Notifications