పూర్తిగా తప్పిన లెక్క ? ట్రంప్ పదవికి ఎసరు పెట్టబోతున్న ఇరాన్ వార్..!

ఇరాన్ (iran) సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని అంతమొందించడంతో యుద్దం ముగిసిపోతుందని, ఆ దేశం లొంగిపోతుందని భావించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) కు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. చూస్తుండగానే యుద్ధం ప్రారంభమై వారం రోజులు గడిచిపోయింది. ఓవైపు ఆయుధాగారం ఖాళీ అవుతోంది. మరోవైపు ఇరాన్ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. దీంతో ఈ వార్ నుంచి ఎలా బయటపడాలో తెలియక ట్రంప్ పైకి గాంభీర్య ప్రకటనలు చేస్తున్నట్లు అర్దమవుతోంది.

తొలుత ఈ యుద్ధం నాలుగు-ఐదు వారాలకు మించదని డొనాల్డ్ ట్రంప్ అంచనా వేశారు. అయితే ఆయన ప్రభుత్వం సుదీర్ఘ యుద్ధానికి సిద్ధంగా లేదని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ యుద్ధం సెప్టెంబర్ వరకు సాగితే ట్రంప్ అధ్యక్ష పదవికి సవాలుగా మారే ప్రమాదముందని తేలిపోయింది. ఇరాన్‌పై సుదీర్ఘ సైనిక చర్యకు ఇజ్రాయెల్‌తో కలిసి సిద్ధమవుతున్న ట్రంప్.. గూఢచార కార్యకలాపాలను ముమ్మరం చేస్తోంది. చూస్తుండగానే ఈ యుద్ధం మధ్యప్రాచ్యంలోని 9 దేశాలకు విస్తరించింది. అయినా పరిష్కార సంకేతాలు కనిపించట్లేదు. దీంతో వరుసగా రెండోసారి అధ్యక్ష పదవి దక్కించుకోవాలన్న ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లుతోంది.

The Iran Crisis That Won t End A Major Threat to Donald Trump s Re-election

అమెరికా అధికారులు ఈ యుద్ధం కనీసం సెప్టెంబర్ వరకు అంటే అమెరికాలో మధ్యంతర ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. ట్రంప్ తొలుత చెప్పిన నాలుగు-ఐదు వారాల అంచనా కేవలం నాలుగు రోజులకే మారిపోయింది. అమెరికా భారత్‌కు 30 రోజుల పాటు రష్యా చమురు కార్గోలను కొనుగోలు చేసేందుకు తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. హార్ముజ్ జలసంధిలో అంతరాయాల మధ్య ఈ చర్య గల్ఫ్ ఇంధన ప్రవాహాలు త్వరగా సాధారణ స్థితికి వస్తాయనే అంచనాలో ఉన్నట్లు దీంతో అర్దమవుతోంది. అయితే ఈ వేగవంతమైన సైనిక సన్నాహాలు.. యుద్ధ తీవ్రతను, ఇరాన్ దృఢత్వాన్ని అమెరికా తక్కువ అంచనా వేసిందని స్పష్టం చేస్తుంది.

The Iran Crisis That Won t End A Major Threat to Donald Trump s Re-election

చైనా విస్తృత సహాయంతో ఇరాన్ భారీ డ్రోన్‌లు, క్షిపణుల ఆయుధాగారాన్ని కూడబెట్టింది. ట్రంప్ తక్కువ అంచనా వేసిన ఈ ఆయుధాలను టెహ్రాన్ మధ్యప్రాచ్యం అంతటా దాడులకు ఉపయోగిస్తోంది. ఉన్నత కమాండర్లను కోల్పోయినప్పటికీ.. ఇరాన్ సైన్యం.. నిర్ణయాలు తీసుకోవడంలో పట్టు బిగిస్తోంది. గల్ఫ్ దేశాలపై డ్రోన్‌లు, క్షిపణులతో తీవ్ర దాడులు చేస్తోంది. నాయకత్వ నిర్మూలనకు అధికారాన్ని కింది స్థాయికి బదిలీ చేయడం ఇరాన్ వ్యూహమని తేలిపోతోంది. నాటో సభ్య దేశమైన టర్కీపై ఇరాన్ దాడి చేయడం, అది వెనక్కి తగ్గదనే దాని నిశ్చయాన్ని స్పష్టం చేస్తుంది. అంతర్గత నిరసనల్ని అణచివేసిన ఇరాన్ పై ప్రజావ్యతిరేకత ఉంటుందని అమెరికా, ఇజ్రాయెల్ వేసిన లెక్కలు తప్పాయి. దీంతో ఈ యుద్ధం ట్రంప్ అధ్యక్ష పదవికి తీవ్ర సవాలుగా మారబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+