వైట్ హౌస్ డిన్నర్ లో భారీ ఫైరింగ్: హుటాహుటిన ట్రంప్ తరలింపు

అమెరికా రాజధాని వాషింగ్టన్ లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. భారీ భద్రత లోపం సంభవించింది. ఫలితంగా వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ నుండి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇతర పరిపాలనా అధికారులను హుటాహుటిన సురక్షిత ప్రదేశానికి తరలించాల్సి వచ్చింది. డిన్నర్ కొనసాగుతున్న సమయంలో ఓ వ్యక్తి అనూహ్య చర్యకు పాల్పడటం దీనికి కారణం. తక్షణమే అక్కడి వారందరూ తమ ప్రాణాలను రక్షించుకోవడానికి కిందికి వంగారు. కొందరు టేబుళ్ల కింద తలదాచుకున్నారు.

వైట్ హౌస్ వార్తలను కవర్ చేసే ప్రెస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ కోసం ఏర్పాటు చేసిన డిన్నర్ ఇది. వాషింగ్టన్ లోని హిల్టన్ హోటల్‌ లో అమెరికా కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఏర్పాటైంది. దీనికి డొనాల్డ్ ట్రంప్‌తో పాటు పలువురు వైట్ హౌస్ అత్యున్నత అధికారులు హాజరయ్యారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్, మరికొందరు వైట్ హౌస్ అడ్వైజర్లు ఉన్నారు.

Trump and Top US Officials evacuated as Threat During the White House Correspondents Dinner to Stop

వారందరూ తమకు కేటాయించిన స్థానాల్లో కూర్చున్న కొద్దిసేపటికే హఠాత్తుగా భారీ శబ్దాలు వినిపించాయని ఈ డిన్నర్ లో పాల్గొన్న పొలిటికో రిపోర్టర్ తెలిపారు. ఆ వెంటనే హాలులో ఉన్న అతిథులు టేబుళ్ల కింద తలదాచుకున్నారు. భద్రతా సిబ్బంది బ్యాంక్వెట్ హాల్‌ను చుట్టుముట్టారు. "మూవ్ దట్ సైడ్.. ", "టేక్ ఎ సేఫ్ షెల్టర్.. ", "గెట్ డౌన్ టేబుల్.." అంటూ పలువురు కేకలు పెట్టడం వినిపించింది. ఈ భారీ శబ్దాలు వినిపిస్తోన్న సమయంలో అతిథులు డిన్నర్ జరుగుతున్న బాల్‌రూమ్‌లోనే ఉన్నారని సమాచారం.

అదే సమయంలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు డొనాల్డ్ ట్రంప్, జేడీ వాన్స్ ను రక్షించడానికి వేదికపైకి దూసుకురావడం, రక్షణగా వారిని చుట్టుముట్టడ కనిపించింది. అతిథులను టేబుల్స్ కిందకు వంగమని ఆదేశించారు. దీంతో క్షణాల్లో అక్కడి వాతావరణం సమూలంగా మారిపోయింది. అప్పటివరకు ఆహ్లాదకరంగా ఉన్న ఆ ప్రదేశంలో ఒక్కసారిగా భీతావహ పరిస్థితులు అలముకున్నాయి. గందరగోళం నెలకొంది. అరుపులు కేకలతో మార్మోగిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+