'మీ దేశంలోని అత్యంత అందమైన మహిళను నాకు ఇవ్వండి' ఆర్మీ చీఫ్ సంచలన డిమాండ్

ఉగాండా దేశ అధ్యక్షుడు, ఆర్మీ చీఫ్ జనరల్ మహూజీ కైనెరుగబా మరోసారి తన వింత వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఈ మేరకు టర్కీ దేశానికి రెండు డిమాండ్స్ పెట్టారు. ఒకటి ఏళ్లుగా సోమాలియాలో ఇస్లామిక్ ఉగ్రవాదులను అణచివేస్తూ ఆదేశానికి మిలిటరీని పంపించినందుకు 1 బిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే రెండో డిమాండ్ కింద టర్కీలోనే అత్యంత అందమైన మహిళను తనకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆమెను తన భార్యగా చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

అయితే ఉగాండా ఆర్మీ చీఫ్ జనరల్ మహూజీ కైనెరుగబా ఇలాంటి డిమాండ్స్ చేయడం ఇదేమీ మొదటిసారి కాదు.. 2022 లోనూ ఆయన ఇలాంటి వింత డిమాండ్ పెట్టి వార్తల్లో నిలిచారు. 2022 లో ఇటలీకి 100 ఆంకోల్ ఆవులను ఇస్తాం.. దానికి బదులుగా ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీని వివాహం చేసుకోవాలి.. అని వింత కోరికను బహిర్గతం చేశారు. ఇప్పుడు ఏళ్ల తర్వాత.. టర్కీకి చెందిన అత్యంత అందమైన మహిళ తనకు భార్యగా కావాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఈ మేరకు టర్కీకి 30 రోజుల అల్టిమేటం జారీ చేశారు ఉగాండా ఆర్మీ చీఫ్ జనరల్ మహూజీ కైనెరుగబా. లేదంటే దౌత్యపరంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కంపాలాలోని టర్కీ ఎంబసీని క్లోజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఉగాండా అధ్యక్షుడు యోవేరీ మూసేవెనీ కుమారేడు ఈ మహూజీ కైనెరుగబా.. సోమాలియాలో అల్- షహబ్ ఉగ్రవాదులతో ఉగాండా సైన్యం పోరాడుతూ అక్కడి ప్రజలకు భద్రత కల్పిస్తుంటే.. టర్కీ అక్కడ వ్యాపార సంబంధాలు చేస్తూ భారీగా లాభపడుతోందని మహూజీ కీలక ఆరోపణలు చేశారు. దాంతో సెక్యూరిటీ డివిడెండ్ కింద 1 బిలియన్ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

Uganda Army Chief Demands 1 Billion and Most Beautiful Woman from Turkey in Bizarre RequestUganda

అలాగే డబ్బుతో పాటు టర్కీలోని అత్యంత అందమైన మహిళ తనకు కావాలని మహూజీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ డిమాండ్స్ నెరవేర్చకపోతే టర్కిష్ ఎయిర్ లైన్స్ ను తమ గగనతలం గుండా ప్రయాణించకుండా నిషేధిస్తామని హెచ్చరించారు. అలాగే గతంలో కెన్యా రాజధాని నౌరోబీని తమ సైన్యం రెండు రోజుల్లోనే ఆక్రమించగలదని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా ఇజ్రాయెల్ కు మద్దతుగా లక్ష మంది ఉగాండా సైన్యాన్ని పంపించేందుకు సిద్ధంగా ఉన్నామని కీలక ప్రకటన చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+