ఒక్క రోజు యుద్ధానికి ఇన్ని వందల కోట్లు ఖర్చా?

ఇరాన్‌తో జరుగుతున్న పోరాటంలో అమెరికా భారీ మూల్యాన్ని చెల్లించుకుంటోంది. ఈ యుద్ధం ఆయుధ సంపదను హరించుకుపోవడమే కాకుండా, అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెను భారాన్ని మోపుతోంది. 'న్యూయార్క్ టైమ్స్' తాజా నివేదిక ప్రకారం.. అమెరికా ఈ యుద్ధం కోసం రోజుకు సగటున ఒక బిలియన్ డాలర్లు (సుమారు రూ.8,400 కోట్లు నుంచి రూ.9,400 కోట్లు) ఖర్చు చేస్తోంది. ఇప్పటివరకు దాదాపు 35 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3 లక్షల కోట్లు) వ్యయమైనట్లు అంచనా.

అమెరికా రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైన ఆయుధాలు వేగంగా నిండుకుంటుండటం రక్షణ నిపుణులను కలవరపెడుతోంది.

US Iran War Costs Hits 1 Billion Dollars Daily High-Tech Missile Stocks Like Patriot and Tomahawk Shrink Rapidly
  • JASSM-ER క్షిపణులు: 960 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే ఈ స్టెల్త్ క్షిపణులను ఇప్పటివరకు 1,100 ప్రయోగించారు. ప్రస్తుతం అమెరికా వద్ద కేవలం 1,500 మాత్రమే మిగిలి ఉన్నాయి.
  • టోమాహాక్ క్షిపణులు: సాధారణంగా ఏడాది పొడవునా సేకరించే క్షిపణుల కంటే పది రెట్లు ఎక్కువగా, అంటే 1,000కి పైగా టోమాహాక్‌లను ఈ యుద్ధంలో వాడేశారు. వీటి నిల్వలు పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో చైనా వంటి దేశాల నుంచి ఎదురయ్యే సవాళ్లను తట్టుకోవడానికి సరిపోవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
  • ప్యాట్రియాట్ ఇంటర్‌సెప్టర్లు: ఇరాన్ డ్రోన్లను అడ్డుకోవడానికి 1,200కు పైగా ప్యాట్రియాట్ క్షిపణులను వాడారు. వీటిలో ఒక్కో క్షిపణి ఖరీదు రూ. 33 కోట్లకు పైమాటే!

'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' ప్రభావం..

ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ సైనిక చర్య వల్ల అమెరికా తన గ్లోబల్ ప్లానింగ్‌ను మార్చుకోవాల్సి వచ్చింది. ఇరాన్‌పై పట్టు సాధించేందుకు యూరప్, ఆసియా దేశాల్లో మోహరించిన సైన్యాన్ని, డ్రోన్లను అమెరికా వెనక్కి పిలిపించుకుంది. చివరికి ఉత్తర కొరియాను ఎదుర్కోవడానికి దక్షిణ కొరియాలో ఉంచిన THAAD రక్షణ వ్యవస్థను కూడా మధ్యప్రాచ్యానికి మళ్లించాల్సి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

సామాన్యుడిపై యుద్ధ భారం

యుద్ధం ప్రభావం కేవలం ఆయుధాలకే పరిమితం కాలేదు, అమెరికా పౌరుల జేబులకు కూడా చిల్లు పడుతోంది. హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడి, అమెరికాలో లీటరు పెట్రోల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. అమెరికాలోని 4 కోట్ల మంది పేదలకు ఆహారం అందించే 'ఫుడ్ స్టాంప్స్' పథకానికి అయ్యే మూడు రోజుల ఖర్చును, ఈ యుద్ధం కేవలం ఒక్క రోజులోనే మింగేస్తోంది.

ఇది 'మంచుకొండ అగ్రభాగం' మాత్రమేనా?

హార్వర్డ్ ఆర్థికవేత్త లిండా బిల్మ్స్ ప్రకారం.. ఇప్పుడు కనిపిస్తున్న 35 బిలియన్ డాలర్ల ఖర్చు కేవలం ఆరంభం మాత్రమే. యుద్ధంలో గాయపడిన సైనికుల పెన్షన్లు, వైద్య ఖర్చులు కలిపితే ఈ యుద్ధం ముగిసేసరికి అమెరికాకు ఒక ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.84 లక్షల కోట్లు) భారం పడుతుందని ఆమె అంచనా వేస్తున్నారు.

వైట్ హౌస్ ఏమంటోంది?

యుద్ధ నిల్వలు తగ్గిపోతున్నాయన్న వార్తలను వైట్ హౌస్ కొట్టిపారేసింది. ఇవన్నీ "నకిలీ వార్తలు" అని, దేశ రక్షణకు అవసరమైన ఆయుధాలు తమ వద్ద పుష్కలంగా ఉన్నాయని ట్రంప్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పష్టం చేశారు. అయితే, వాడిన క్షిపణులను మళ్ళీ తయారు చేయడానికి ఏళ్ల సమయం పడుతుందని సెనేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+