Bank Holidays: జులైలో బ్యాంకులు ఎన్ని రోజులు క్లోజ్?
బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్య గమనిక. జులై 2026 నెల వచ్చేస్తోంది. ఈ నెలలో మీరు బ్యాంకుకు వెళ్లి ఏదైనా ముఖ్యమైన పని పూర్తి చేయాలనుకుంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన సెలవుల జాబితాను ఒకసారి చూసుకోవడం చాలా మంచిది. జులై నెలలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో శని, ఆదివారాలు మరియు స్థానిక పండుగలతో కలుపుకుని మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) సెలవులు ఇవే:
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బ్యాంకులకు జులై నెలలో ఎలాంటి ప్రత్యేక ప్రాంతీయ పండుగ సెలవులు లేవు. కేవలం సాధారణ వారాంతపు సెలవులు (ఆదివారాలు, రెండు శనివారాలు) మాత్రమే వర్తిస్తాయి.

- జులై 5: ఆదివారం (వారంతపు సెలవు)
- జులై 11: రెండో శనివారం (బ్యాంక్ సెలవు)
- జులై 12: ఆదివారం (వారంతపు సెలవు)
- జులై 19: ఆదివారం (వారంతపు సెలవు)
- జులై 25: నాల్గోవ శనివారం (బ్యాంక్ సెలవు)
- జులై 26: ఆదివారం (వారంతపు సెలవు)
ఈ 6 రోజులు మినహాయిస్తే మిగిలిన అన్ని రోజుల్లోనూ ఏపీ, తెలంగాణలలో బ్యాంకులు యథావిధిగా పని చేస్తాయి.
ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ సెలవుల వివరాలు:
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో సంస్కృతి, స్థానిక పండుగలను బట్టి కింది రోజుల్లో బ్యాంకులు పనిచేయవు:
- జులై 6 (సోమవారం): 'మిజో హ్మెయిచ్చే ఇన్సుయిఖ్నాం పౌల్ డే' (MHIP Day) సందర్భంగా మిజోరంలో బ్యాంకులు బంద్.
- జులై 9 (గురువారం): 'బెహ్ దైన్‌ఖ్లామ్' పండుగ కారణంగా మేఘాలయలో బ్యాంకులకు సెలవు.
- జులై 16 (గురువారం): జగన్నాథ రథయాత్ర, హరేలా పండుగల సందర్భంగా ఒడిశా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివుంటాయి.
- జులై 17 (శుక్రవారం): స్వాతంత్య్ర సమరయోధుడు యు తిరోత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మేఘాలయలో సెలవు.
- జులై 18 (శనివారం): బౌద్ధ పండుగ 'ద్రుక్పా త్షె-జి' సందర్భంగా సిక్కింలో బ్యాంకులు పనిచేయవు.
- జులై 22 (బుధవారం): 'ఖర్చి పూజ' పండుగ సందర్భంగా త్రిపురలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ.. ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్, ఏటీఎం (ATM) సేవలు 24 గంటలూ అందుబాటులోనే ఉంటాయి. అత్యవసర నగదు బదిలీల కోసం డిజిటల్ పద్ధతులను ఉపయోగించుకోవచ్చు.














Click it and Unblock the Notifications