టీ కప్పులో తుఫాన్ రేపిన ట్రంప్..! భారత్ ఆగ్రహంతో యూటర్న్..!
అమెరికా (US) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) భారత్ (india)ను "నరకకూపం" అని అభివర్ణించే పాడ్‌క్యాస్ట్‌ను రీపోస్ట్ చేసిన తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఈ పరిణామాలపై వాషింగ్టన్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. సాయంత్రానికి అమెరికా రాయబార కార్యాలయం భారత్, న్యూఢిల్లీ నాయకత్వాన్ని ప్రశంసించింది.
అమెరికన్ రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ తన పాడ్ కాస్ట్ లో భారత్, చైనాల్ని మురికి కూపాలుగా అభివర్ణించాడు. అయితే దీన్ని అమెరికా అధ్యక్ష హోదాలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ముందూ వెనుకా చూసుకోకుండా తిరిగి పోస్ట్ చేయడంతో వివాదం తలెత్తింది. అమెరికాలో జన్మతః పౌరసత్వాన్ని వ్యతిరేకిస్తూ సావేజ్.. భారత్, చైనాలను "నరకకూపాలు"గా అభివర్ణించాడు. ఈ పోస్ట్ తీవ్ర అలజడి సృష్టించింది. ట్రంప్ ఇప్పటికే అమెరికాలో పుట్టారన్న కారణంగా విదేశీ పిల్లలకు ఆటోమేటిగ్గా జన్మతః పౌరసత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ నిర్ణయాన్ని అమెరికా కోర్టులు అడ్డుకున్నాయి. దీంతో ఆయన కోర్టులపైనా మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలో ట్రంప్ ఈ పాడ్ కాస్ట్ ను రీపోస్ట్ చేయడంతో ఢిల్లీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే ట్రంప్ ను నేరుగా తప్పుబట్టలేదు.

ట్రంప్ పోస్ట్ చేసిన పాడ్ కాస్ట్ కంటెంట్ పై భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ.. మేము కొన్ని నివేదికలను చూశాం. దాని గురించి ఇంతే చెప్పగలను అని వ్యాఖ్యానించారు. అనంతరం అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి.. ట్రంప్ 'భారత్ గొప్ప దేశం, నాకు చాలా మంచి స్నేహితుడు దాని నాయకత్వంలో ఉన్నారు' అని అన్నారని స్పష్టం చేశారు. ట్రంప్ తన వ్యాఖ్యల తర్వాత రేగిన ఆగ్రహాన్ని తగ్గించే ప్రయత్నంగా, భారత్‌ను గొప్ప దేశంగా, సన్నిహిత భాగస్వామిగా ఆయన పేర్కొన్నారు. దీంతో వివాదం సద్దుమణిగినట్లయింది.












Click it and Unblock the Notifications