వైట్‌హౌస్ లాక్‌డౌన్.. హైటెన్షన్!

ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అమెరికా అధ్యక్ష కార్యాలయం 'వైట్‌హౌస్' సమీపంలో మరోసారి తుపాకీ తూటాలు పేలాయి. ఒక సాయుధుడు భద్రతా బలగాలే లక్ష్యంగా కాల్పులకు దిగడంతో వాషింగ్టన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటన జరిగిన సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధంలోనే ఉండటంతో భద్రతా యంత్రాంగం వెంటనే అప్రమత్తమై వైట్‌హౌస్‌ను కొద్దిసేపు లాక్‌డౌన్ చేసింది.

వైట్‌హౌస్ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తి, అక్కడ ఉన్న అధికారులపైకి ఆయుధాన్ని ఎక్కుపెట్టాడు. పరిస్థితిని గమనించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిందితుడిపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు తీవ్రంగా గాయపడగా, అతడిని అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ పెను ప్రమాదంలో ఒక చిన్నారికి కూడా గాయాలైనట్లు సీక్రెట్ సర్వీస్ ధృవీకరించింది. ప్రస్తుతం ఆ బాలుడికి ప్రాణాపాయం లేదని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం.

White House Security Breach Secret Service Shoots Armed Suspect Near Trump s Residence as Lockdown Imposed
KA Paul కళ్ళముందే ట్రంప్‌పై కాల్పులు! ప్రత్యక్ష సాక్షిగా షాకింగ్ నిజాలు!
KA Paul కళ్ళముందే ట్రంప్‌పై కాల్పులు! ప్రత్యక్ష సాక్షిగా షాకింగ్ నిజాలు!

జేడీ వాన్స్ కాన్వాయ్ వెళ్లిన కాసేపటికే..

ఈ ఘటనకు మరో ముఖ్యమైన అంశం తోడైంది. కాల్పులు జరగడానికి కేవలం కొద్ది నిమిషాల ముందే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు సంబంధించిన కాన్వాయ్ అదే మార్గంలో ప్రయాణించింది. అయితే, ఈ దాడి ఉపాధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకుని జరిగిందని తాము భావించడం లేదని యూఎస్ సీక్రెట్ సర్వీస్ (USSS) డిప్యూటీ డైరెక్టర్ మాథ్యూ క్విన్ స్పష్టం చేశారు. కాల్పుల శబ్దంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ప్రస్తుతం ఆ ప్రాంతం మొత్తం భద్రతా బలగాల ఆధీనంలో ఉంది.

యుద్ధంపై బెట్టింగ్ కాసి కోట్లు సంపాదించారు: వైట్ హౌస్ ఇన్సైడర్ ట్రేడింగ్ మిస్టరీ
యుద్ధంపై బెట్టింగ్ కాసి కోట్లు సంపాదించారు: వైట్ హౌస్ ఇన్సైడర్ ట్రేడింగ్ మిస్టరీ

కొనసాగుతున్న దర్యాప్తు.. పాత ఘటనలతో లింక్?

ఇటీవల వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో నిర్వహించిన వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమంలో కూడా ఇటువంటి కలకలమే రేగింది. ట్రంప్, జేడీ వాన్స్ సహా పలువురు ఉన్నత స్థాయి మంత్రులు ఉన్న సమయంలో జరిగిన ఆ ఘటనకు, ప్రస్తుత దాడికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. నిందితుడు అసలు కాల్పులకు ఎందుకు దిగాడు? అతడి వెనుక ఎవరైనా ఉన్నారా? అనే విషయాలను వెలికి తీసేందుకు ఎఫ్బీఐతో కలిసి సీక్రెట్ సర్వీస్ లోతైన దర్యాప్తు చేపట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+