హైదరాబాద్‌లోని ఈ టూరిస్ట్ స్పాట్స్ ను సమ్మర్‌లో విజిట్ చేస్తే ఆ కిక్కే వేరప్పా..
హైదరాబాద్ మహానగరం దినదినాభివృద్ధి చెందుతోంది. నిత్యం పెరుగుతున్న రవాణా, జనాభా కారణంగా భాగ్యనగరంలో ఉండేవారికి కాంక్రీట్ జంగిల్ లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక వీకెండ్స్, సెలవు రోజుల్లో అయితే నగర వాసులు ఇతర రాష్ట్రాలకు ట్రిప్ వెళ్తుంటారు. అలా రెండు మూడు రోజులు పచ్చని ప్రకృతి ప్రదేశాల్లో గడిపి వస్తుంటారు. అయితే హైదరాబాద్ లోనే హిల్ స్టేషన్స్ ను తలపించే కొన్ని టూరిస్టు ప్రాంతాలు ఉన్నాయని మీకు తెలుసా..? వీటిని చూస్తే మళ్లీ మళ్లీ ఇక్కడకు వెళ్లి ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. వాటి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
హైదరాబాద్ కు దగ్గరలోని ప్రాంతాల గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా అనంతగిరి హిల్స్ చెప్పుకోవాలి. అనంతగిరి హిల్స్ కు హైదరాబాద్ నుంచి 1.5 నుంచి 2 గంటల్లో చేరుకోవచ్చు. ఇక్కడి పచ్చని కొండలు, ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా అనంత పద్మనాభ స్వామి ఆలయం, దాని చుట్టూ ఉన్న దట్టమైన అడవులు ప్రకృతి ప్రేమికులను మైమరిపింపజేస్తాయి. అలాగే ఉదయం సూర్యోదయం సమయంలో ఇక్కడి ప్రాంతం దట్టమైన పొగమంచుతో అలుముకుని ఉంటుంది. అందుకే ఈ ప్రాంతం హిల్ స్టేషన్ ను తలపించేలా ఉంటుంది. ఇక్కడికి దగ్గరలో కోట్ పల్లి రిజర్వాయర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.
షమీర్ పేట సరస్సు ఇటీవల కాలంలో వేగంగా అభివృద్ది చెందుతోంది. అందువల్ల నగర వాసుల తాకిడి ఎక్కువైంది. ముఖ్యంగా వీకెండ్స్, సెలవురోజుల్లో ఇక్కడికి అనేకమంది ఫ్యామిలీతో విజిట్ చేస్తుంటారు. దాంతో వారాంతంలో ఇక్కడ సందడిగా కోలాహలంగా ఉంటుంది. ఇక్కడికి సమీపంలో డీర్ పార్క్ కూడా ఉంటుంది. ఈ డీర్ పార్కులో చిటాల్, బ్లాక్ బక్ లాంటి వన్యప్రాణులను సందర్శించవచ్చు. షమీర్ పేట్ సరస్సు ఒడ్డున కూర్చుని చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయవచ్చు.
జూబ్లీ హిల్స్ రోడ్ నెం 12 లో ఉన్న లోటస్ పాండ్ సైతం ప్రకృతి ప్రేమికులకు ఒక అద్భుతమైన ప్రదేశంగా ఉంది. ఈ ప్రదేశానికి ఎంట్రీ ఫీజు లేదు పూర్తిగా ఉచితం. ఈ కొలనులో వికసిస్తున్న తామర పువ్వులను అలాగే అనేక దేశీయ, విదేశీ పక్షులను కూడా చూడవచ్చు. ఇక్కడి చెట్లు చాలా దట్టంగా ఉంటాయి. అందుకే నేరుగా సూర్యరశ్మి నేలను చేరడం చాలా అరుదు అని చెబుతారు. దీనివల్ల ఆహ్లాదకరమైన చల్లని వాతావరణం నెలకొని ఉంటుంది. ఫోటోగ్రఫీ ప్రియులకు, ప్రశాంతంగా పుస్తకాలు చదవాలనుకునే వారికి ఈ ప్రదేశం ఒక స్వర్గధామం అని చెప్పొచ్చు.

అలాగే వీటితోపాటు కేబుల్ బ్రిడ్జి కూడా నగరవాసులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడ ఇటీవల నిర్మించిన ఫ్లోటింగ్ జెట్టీ ప్రత్యేకంగా పిల్లల కోసం ఏర్పాటు చేసిన పార్క్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రాంతంలోని చల్లని గాలులు ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. అలాగే గాంధీపేట పార్క్ కూడా అద్భుతమైన నదీ తీర పార్క్ గా చెబుతారు. నిజాం కాలంలో ఈ కృత్రిమ సరస్సును నిర్మించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం ఓ ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది.












Click it and Unblock the Notifications