తల్లి కోరిక నెరవేర్చిన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్-ఎమోషనల్ ట్వీట్..!
తెలంగాణ డీజీపీగా తాజాగా ఎంపికైన సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ (CV Anand).. తాను ఎక్కడ ఉన్నా ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తారన్న పేరుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటుంటారు. ఇదే క్రమంలో ఆయన ఇవాళ ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని తాజాగా పరామర్శించిన ఫొటోల్ని షేర్ చేశారు.
దీంతో పాటు సీవీ ఆనంద్.. తన తల్లిని ఉద్దేశించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. "మా అమ్మగారిని పరామర్శించి, ఆమె ఆశీర్వాదం తీసుకున్నాను. ఆమె నవంబర్-జనవరి నెలల్లో చాలా అనారోగ్యంతో ఉన్నారు, ఇప్పుడు మంచానికే పరిమితమైనప్పటికీ, ఆరోగ్యం మెరుగుపడింది. తన కొడుకు ఈ రాష్ట్రానికి డీజీపీ కావాలన్న ఆమె ప్రగాఢ వాంఛే ఆమెను నిలబెట్టిందని నాకు అనిపించింది. ఆమె ఎంతో సంతోషించారు, నేను కూడా అంతే " అని సీవీ ఆనంద్ ట్వీట్ లో పేర్కొన్నారు.

Visited my mother and took her blessings. She was very ill in November-January period and is better now, though bedridden. I felt it was her strong desire to see her son as DGP of this state which pulled her through. She was overjoyed and so too was I 🙏🏻🙏🏻 pic.twitter.com/DboOUUBlzK
— CV Anand IPS (@CVAnandIPS) May 3, 2026
సీవీ ఆనంద్ డీజీపీగా ఎంపికయ్యారని తెలిసిన తర్వాత ఆమె తల్లిని కలిసారు. ఎప్పటి నుంచో తన కొడుకు డీజీపీ అవుతాడన్న ఆశతో ఉన్న ఆ తల్లిని కలిసి, తన కోరిక నేరవేర్చినట్లు సంతోషంగా చెప్పుకున్నారు. దీంతో ఆమె కూడా సంతోషంగా కుమారుడు సీవీ ఆనంద్ ను ఆశీర్వదించి పంపింది. అనంతరం సీవీ ఆనంద్ వచ్చి డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ చేయడంతో దీనిపై పలువురు సానుకూలంగా స్పందిస్తున్నారు.












Click it and Unblock the Notifications