తెలంగాణలో మొట్టమొదటి "హార్ట్ షేప్ గ్లాస్ బ్రిడ్జ్".. ఎక్కడో తెలుసా..?
తెలంగాణలో బ్రిడ్జ్ అనగానే చాలామందికి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ గుర్తుకువస్తుంది. ఇది హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ లో ఉంది. రాత్రివేళల్లో విద్యుత్ దీపాల అలంకరణతో ఈ బ్రిడ్జ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ బ్రిడ్జ్ ను మైమరిపించేలా ఇప్పుడు హైదరాబాద్ కు సమీపంలోనే మరో బ్రిడ్జ్ నిర్మాణం అవుతోంది. అదే సిద్దిపేటలోని హుస్నాబాద్ హార్ట్ షేప్ గ్లాస్ బ్రిడ్జ్. ఇది తెలంగాణలోనే మొట్టమొదటి "హార్ట్ షేప్ గ్లాస్ బ్రిడ్జ్" కావడం విశేషం. ఎల్లమ్మ చెరువుపై నిర్మించిన ఈ బ్రిడ్జ్ గుండె ఆకారంలో ఉంటుంది. ఇదే దీని ప్రత్యేకత. ఈ బ్రిడ్జ్ వాహనదారులకు మరచిపోలేని అనుభూతిని కలిగించనుంది.
ఈ హార్ట్ షేప్ గ్లాస్ బ్రిడ్జ్ వాహదారులకు రద్దీని తగ్గించడమే కాకుండా టూరిస్టు ఎట్రాక్షన్ గా కూడా మారనుంది. ఇలాంటి హార్ట్ షేప్ బ్రిడ్జ్ తెలంగాణలో ఎక్కడా లేదు. దాంతో పర్యటకులు ఈ బ్రిడ్జ్ ను చూసేందుకు క్యూ కట్టే అవకాశం ఉంది. ఇది అత్యాధునిక ఇంజినీరింగ్ టెక్నాలజీకి నిదర్శనంగా నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఈ బ్రిడ్జ్ ను ట్రాన్స్ పరెంట్ గ్లాస్ ప్యానెల్స్ తో నిర్మించారు. అంటే బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నప్పుడు కింద నీటిని స్పష్టంగా చూడొచ్చు. నీటిపై నుంచి వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇది ప్రయాణికులకు థ్రిల్లింగ్ అనుభూతిని పంచుతుంది.

ఇక ఈ బ్రిడ్జ్ హైదరాబాద్ కు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే కరీంనగర్ నుంచి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఈ బ్రిడ్జ్ ఉంది. నగరవాసులకు వీకెండ్ లో ఇక్కడకు వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేసే విధంగా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అయితే ఈ హార్ట్ షేప్ గ్లాస్ బ్రిడ్జ్ ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. త్వరలోనే పూర్తి చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం పనులను వేగవంతం చేసింది. ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దాంతో మున్ముందు పర్యటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది.












Click it and Unblock the Notifications