ATA: అట్లాంటాలో ఆట ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్..
అమెరికాలోని అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదుతో పాటుతో బ్యాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమాలను అమెరికాలోని అట్లాంటాలో నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో వేలాది మంది పాల్గొన్నారు. చాలా మంది సభ్యత్వం పొందారు. ATA సంస్థ అట్లాంటా కార్యవర్గాన్ని మరింత ఉత్సుకతతో కార్యనిమజ్ఞులయ్యే విధంగా ప్రోత్సహించింది. తెలుగు వారు కనపరచిన ఆత్మీయ అభిమానానికి, అనిర్వచనీయ సహకారానికిగానూ ATA కార్యవర్గం హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపింది.
సకల సన్నాహాల నడుమ అత్యద్భుత నిర్వహణలో ATA బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ ఆటలో చాలా మంది క్రీడాస్ఫూర్తితో పాల్గొన్నారు. అట్లాంటా బ్యాడ్మింటన్ క్లబ్ నిర్వహించిన మ్యాచ్ ల్లో పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొని షటీల్ ఆడారు. అట్లాంటా RC కిషన్, సందీప్, గణేష్, నేషనల్ టీం నిరంజన్ పొద్దుటూరి, శివ రామడుగు, JC, కాన్ఫరెన్స్ టీం కరుణాకర్ అసిరెడ్డి, అనిల్ బొడ్డిరెడ్డి, శ్రీధర్ T, శ్రీరామ్ & అనంత్ C లను ATA సంస్థ ప్రత్యేకంగా అభినందించింది.

ATA లో చేరిన నూతన సభ్యులకు, టోర్ణమెంట్ లోని విజేతలకు, పాల్గొన్న ఔత్సాహికులకు ATA అభిమాన పూర్వక అభినందనలు తెలియచేసింది. అమెరికాలోని తెలుగు వారు ఎప్పుడు ఐఖ్యంగా ఉండాలని కోరింది. కొద్ది రోజలు అమెరికా తెలంగాణ సంఘం ఆటలో విలీనమైంది. ఆట ఆధ్వర్యంలో అమెరికాలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి కళాకారులను తీసుకెళ్లి సభలు నిర్వహిస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమెరికాలో ఆటతో పాటు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) కూడా ఉంది.












Click it and Unblock the Notifications