డొనాల్డ్ ట్రంప్‌కు శరాఘాతం- భారతీయులకు భారీ ఊరట: 14 రోజుల్లో

Donald Trump on Birthright Citizenship: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆయన జారీ చేసిన తొలి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల అమలు విషయంలో చుక్కెదురైంది. జన్మతః పౌరసత్వ హక్కు రద్దు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను అక్కడి ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఇది- రాజ్యాంగ విరుద్ధ చర్యగా అభివర్ణించింది.

భారతీయులతో పాటు..

జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసిన విషయం తెలిసిందే. భారతీయులతో పాటు నాన్ అమెరికన్లందరిపైనా తీవ్ర ప్రభావాన్ని చూపే ఆర్డర్ ఇది. తొలి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లలోనే దీన్ని పొందుపరిచారంటే బర్త్ రైట్ సిటిజన్‌షిప్ (జన్మతః నాన్ అమెరికన్లకు లభించే పౌరసత్వం)పై ఆయన ఎంత వ్యతిరేకంగా ఉన్నారనేది అర్థం చేసుకోవచ్చు.

Seattle court temporarily blocked an executive order by Donald Trump birthright citizenship in the US

ఆటోమేటిక్‌గా పౌరసత్వం లభించే విధానం..

నాన్ అమెరికన్లకు ఆ దేశ గడ్డపై పుట్టిన బిడ్డలకు ఆటోమేటిక్‌గా పౌరసత్వం లభించే విధానం ఇప్పటిది కాదు. 150 సంవత్సరాలుగా ఇది అమల్లో ఉంటూ వస్తోంది. 1868లో 14వ రాజ్యాంగ సవరణ కింద ఈ విధానాన్ని అప్పటి ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. తమ దేశ గడ్డపై జన్మించే ప్రతి పిల్లలకూ జన్మతః పౌరసత్వం లభిస్తుందని ప్రకటించింది.

అమెరిక ఫస్ట్ అనే నినాదం కింద..

దీన్ని రద్దు చేస్తానంటూ గతంలోనూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. నాటి మాటలను చేతల్లో చూపారు. నాన్ అమెరికన్లకు అప్పుడే పుట్టిన పిల్లలకు పౌరసత్వ హక్కును రద్దు చేశారు. అమెరిక ఫస్ట్ అనే నినాదం కింద స్వదేశీయులకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఇమ్మిగ్రేషన్ విధానాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారాయన.

జన్మతః పౌరసత్వ హక్కు ఎప్పుడు లభిస్తుందంటే..

నాన్ అమెరికన్లకు పుట్టిన పిల్లలకు జన్మతః పౌరసత్వ హక్కు ఎప్పుడు లభిస్తుందంటే- ఒకటి తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరికైనా అమెరికా పౌరసత్వం ఉండాలి. రెండు- చట్టబద్ధమైన శాశ్వత చిరునామా ఉండాలి. మూడు- అమెరికా మిలటరీలో సభ్యుడైనా అయి ఉండాలి. దీన్ని అమలు చేయడంలో రాజ్యాంగబద్ధమైన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

భారతీయ తల్లిదండ్రులకు..

ప్రస్తుతం భారతీయ తల్లిదండ్రులకు అమెరికా జన్మించిన పిల్లలు.. హెచ్1బీ వీసాలు, గ్రీన్ కార్డులు లేదా ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోయినా అమెరికా పౌరసత్వాన్ని పొందుతారు. కొత్త నిబంధనల ప్రకారం- తల్లిదండ్రుల్లో ఒకరికి అమెరికా పౌరసత్వం ఉండాలి లేదా శాశ్వత నివాసి అయి ఉండాలి. అలాంటి దంపతులకు జన్మించిన పిల్లలు మాత్రమే పౌరసత్వం పొందుతారు.

వ్యతిరేకంగా న్యాయపోరాటం..

దీన్ని వ్యతిరేకిస్తూ వాషింగ్టన్, అరిజోనా, ఇల్లినాయిస్, ఒరెగాన్ రాష్ట్రాలు న్యాయపోరాటానికి దిగాయి. నాన్ అమెరికన్ అసోసియేషన్లు సైతం కోర్టుకెక్కాయి. డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టుల్లో పిటీషన్లు దాఖలు చేశాయి. వాటన్నింటిని కూడా ఆయా న్యాయస్థానాలు విచారణకు స్వీకరించాయి.

సియాటెల్‌లో ఎదురుదెబ్బ..

ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై తాజాగా సియాటెల్ ఫెడరల్ కోర్టు నిలిపివేత ఆదేశాలను ఇచ్చింది. ఈ సందర్బంగా న్యాయమూర్తి కాఘెనార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది- రాజ్యాంగ విరుద్ధ చర్యగా అభివర్ణించారు. యథేచ్ఛగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టయిందని పేర్కొన్నారు. న్యాయనిపుణులు ఎవరు కూడా దీన్ని సమర్థించబోరని, రాజ్యాంగ ఉల్లంఘన చర్యగా పరిగణించవచ్చని వ్యాఖ్యానించారు.

ఎలా సమర్థించగలరు?

జన్మతః పౌరసత్వ హక్కు రద్దు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను రాజ్యాంగబద్ధమైనదని ఏ ఒక్కరు కూడా సమర్థించలేరని న్యాయమూర్తి చెప్పారు. ఇది రాజ్యాంగబద్దమైనదేనంటూ బార్‌ మెంబర్లు ఎలా చెప్పగలరో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. ఈ ఆర్డర్ తనను కదిలించివేసిందని పేర్కొన్నారు.

14 రోజుల పాటు..

నిలిపివేత ఉత్తర్వులు తాత్కాలికమే. 14 రోజుల పాటు అమలులో ఉంటాయి. ఈ లోగా దీనికి సంబంధించిన సంతృప్తికర వివరణను పొందుపరుస్తూ ప్రభుత్వం న్యాయస్థానంలో కౌంటర్ పిటీషన్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. లేదా- రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+