ఏపీలో కొత్తగా 2974 కరోనా కేసులు... మరో 17 మంది మృతి....

ఏపీలో నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2974 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 17 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,40,096కి చేరింది. ఇప్పటివరకూ కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 13,132కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 24,708 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకూ 19,02,256 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 577 కేసులు, చిత్తూరు 501, ప్రకాశం 349 కేసులు అత్యల్పంగా విజయనగరంలో 33 కొత్త కేసులు నమోదయ్యాయి.కోవిడ్ కారణంగా ప్రకాశం జిల్లాలో ఐదుగురు,చిత్తూరు,కృష్ణా జిల్లాల్లో ముగ్గురు,అనంతపురం,తూర్పు గోదావరి జిల్లాల్లో ఇద్దరు,నెల్లూరు,విశాఖపట్నంలలో ఒకరు చొప్పున మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 1,05,024 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా.. ఇప్పటివరకూ 2,35,93,055 శాంపిల్స్‌ను పరీక్షించారు.

2974 new covid cases and 17 deaths reported in andhra pradesh

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ థర్డ్ వేవ్ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. బక్రీద్ పండుగ సందర్భంగా జనం పెద్ద సంఖ్యలో గుమ్మిగూడితే కరోనా వ్యాప్తి జరిగే అవకాశం ఉండటంతో.. మసీదుల్లో ప్రార్థనలపై ఆంక్షలు విధించింది. ఈనెల 20 లేదా 21 తేదీల్లో బక్రీద్ పండుగ ఉండగా, ఆ రోజు రాష్ట్రంలోని అన్ని మసీదుల్లో 50 శాతానికి మించి ఆక్యుపెన్సీ ఉండరాదని, ప్రార్థనల సమయలో కొవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,157 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపితే భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య దాదాపు 3.12 కోట్లకు చేరింది. మరో 518 మంది కరోనాతో మృతిచెందారు. గడిచిన 24 గంటల్లో 42,004 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,22,660గా ఉంది. ఇప్పటివరకూ నమోదైన మరణాల సంఖ్య 4,13,609కి చేరింది. దేశంలో ఇప్పటివరకూ 40,49,31,715 మందికి వ్యాక్సిన్ వేశారు.

కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ప్రధాని మోదీ సహా ఆరోగ్యశాఖ అధికారులు పదేపదే హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్కు,భౌతిక దూరం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+