20 నిమిషాల్లో 3,000 మంది : జూమ్ మీటింగ్ లో లేఆఫ్ చేసిన ఒరాకిల్
Oracle Layoffs: ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఒకటైన ఒరాకిల్.. లేఆఫ్స్ పై దృష్టి సారించింది. దేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. ఇక్కడ పనిచేసే ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మంది ఈ నిర్ణయం వల్ల ప్రభావితులయ్యారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. రాజ్యమేలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒరాకిల్ అధికారికంగా ప్రకటించింది.
దీన్ని మరింత ముమ్మరం చేసింది ఒరాకిల్. క్లౌడ్ విభాగంలో 3,000 మందిని తొలగించింది. ఒకే ఒక్క జూమ్ కాల్ మీటింగ్ పెట్టి.. వీరందరినీ కూడా ఉన్నపళంగా ఉద్యోగాల్లోంచి తీసివేసింది. 20 నిమిషాల పాటు సాగిన జూమ్ మీటింగ్ ఇది. అప్పటికప్పుడు లేఆఫ్ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ సంస్థలో పని చేస్తోన్న మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 10 శాతం మంది కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ మూడువేల మంది ఉద్యోగులు కూడా భారత్‌లో పనిచేసే వాళ్లే. ఓ ప్రాజెక్ట్ అప్‌డేట్ ఉందని వారందరినీ ఒరాకిల్ హెచ్ ఆర్ విభాగం జూమ్ కాల్ ద్వారా మీటింగ్ కు పిలిచింది. అయిదు నిమిషాల పాటు సంస్థ కార్యకలాపాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించిన తర్వాత లేఆఫ్ అంశాన్ని ప్రస్తావించింది. జూమ్ మీటింగ్ లో ఉన్న 3,000 మందిని తొలగించినట్లు ప్రకటించింది. లేఆఫ్ వేటు పడ్డ ఓ ఉద్యోగి తన అనుభవాన్ని వివరించాడు.
ఇదంతా 20 నిమిషాల లోపే ముగిసిందని తెలిపాడు. జూమ్ ఇన్వైట్, కాల్‌లో తొలుత తన మేనేజర్, ఆ తర్వాత హెచ్ ఆర్ స్టాఫ్.. తనను తొలగించినట్లు చెప్పారని వివరించాడు. ఈ తొలగింపులకు పనితీరు కారణంగా కాదని, పూర్తిగా వ్యాపార కారణాల వల్లే అని కంపెనీ యాజమాన్యం స్పష్టం చేసిందని పేర్కొన్నాడు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే తన సిస్టమ్ యాక్సెస్ కట్ అయిందని, దీనివల్ల 2026 ఫిబ్రవరిలో రావాల్సిన కొన్ని బెనిఫిట్స్ ను కూడా కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఒరాకిల్‌కు ఎప్పటినుంచో వ్యూహాత్మకంగా మానవ వనరుగా ఉంటోంది.. భారత్. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, పుణె, నోయిడా, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో సుమారు 28,824 మంది ఉద్యోగులు ఈ సంస్థలో పని చేస్తున్నారు. ఇప్పుడు సుమారు 10 శాతం మంది ఉద్యోగాలు కోల్పోవడం చర్చనీయాంశమైంది. జియో-ఎక్స్‌పాన్షన్ ప్రోగ్రామ్ కింద జైపూర్, భోపాల్, చండీగఢ్, తిరువనంతపురం వంటి టయర్-2, టయర్-3 నగరాల్లోకి కూడా ఒరాకిల్ విస్తరించింది.
ఈ పరిస్థితుల్లో ఏకంగా 10 శాతం మంది ఉద్యోగులను తొలగించాల్సి రావడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. డేటా సెంటర్ డైనమిక్స్ రిపోర్ట్ ప్రకారం- సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, క్లౌడ్ సర్వీసెస్, కస్టమర్ సపోర్ట్ డివిజన్లల్లో పనిచేసే ఉద్యోగులు ఈ తాజా లేఆఫ్స్ వల్ల ప్రభావితమయ్యారు. ఎటువంటి ముందస్తు సమాచారం గానీ, అంతర్గతంగా సర్కులర్లు గానీ లేకుండా ఆకస్మికంగా ఈ నిర్ణయం వెలువడినట్లు డేటా సెంటర్ డైనమిక్స్ తెలిపింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications