Coders: కోడింగ్ బాబులూ.. వేరే జాబ్ వెతుక్కోండి-శ్రీధర్ వెంబూ షాకింగ్..!

ఆంత్రోపిక్ టూల్స్ రాకతో ఓవైపు మార్కెట్లు కుప్పకూలుతున్న వేళ సాఫ్ట్ వేర్ కోడర్లకు జోహో వ్యవస్ధాపకుడు శ్రీధర్ వెంబూ కీలక హెచ్చరికలు చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఏఐ (AI) రాకతో పరిస్ధితులు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఆంత్రోపిక్ వంటి సంస్థలు తెస్తున్న టూల్స్ తో సాఫ్ట్ వేర్ సంస్థల్లో కింది స్దాయి సిబ్బంది అవసరమే ఉండదని తేలిపోతోంది. ఇలాంటి సమయంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా, కోడర్లు (coders)గా పనిచేస్తున్న వారికి జోహో వ్యవస్ధాపకుడు శ్రీధర్ వెంబూ కీలక సూచన చేస్తున్నారు. ఇక కోడర్ల పనైపోయిందని, వారు బతకడానికి కొత్త దార్లు వెతుక్కోవాలని తేల్చేస్తున్నారు.

కోడర్లూ.. వేరే దారి చూసుకోండి..(coders)

ఏఐ ప్రతి రోజూ కొత్త శిఖరాలకు చేరుకుంటున్న తరుణంలో ఐటీ ఉద్యోగులు, ముఖ్యంగా కోడర్ల భవిష్యత్తుపై శ్రీధర్ వెంబూ ఆన్ లైన్ లో కొత్త చర్చకు తెరలేపారు. కోడింగ్ గురించి ఏమాత్రం తెలియకుండానే AI సాయంతో భగవద్గీత యాప్‌ను అభివృద్ధి చేసినట్లు ఓ ఎక్స్ యూజర్ చేసిన పోస్ట్ పై శ్రీధర్ స్పందించారు. తనతో సహా కోడింగ్ చేసే వారంతా ప్రత్యామ్నాయ వృత్తులను పరిశీలించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన తేల్చిచెప్పేశారు.

A Warning for Coders Zoho CEO Sridhar Vembu s Advice on New Livelihoods here is why

నేను కూడా వెతుక్కోవాల్సిందే

ఆంత్రోపిక్ వారి క్లాడ్ AIతో ఒక సీ-కంపైలర్‌ను కూడా నిర్మించింది. ఇది ఏమాత్రం తేలికైన ఇంజనీరింగ్ ఫీట్ కాదని శ్రీధర్ తెలిపారు. ఇలాంటి ఈ సమయంలో జీవనోపాధి కోసం కోడింగ్‌పై ఆధారపడే మనం ప్రత్యామ్నాయ వృత్తులను పరిశీలించడం ఉత్తమం అన్నారు. ఇందులో తనను కూడా చేర్చుకుంటున్నానని తెలిపారు. దీన్ని భయంతో చెప్పడం లేదని, ప్రశాంతమైన అంగీకారంతో, స్వీకారంతో చెబుతున్నానని వెల్లడించారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో, AI విప్లవం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా తీర్చిదిద్దుతుందో తెలుసుకోవడానికి గూగుల్ జెమిని చాట్‌బాట్‌తో తాను వివరంగా మాట్లాడినట్లు వెంబు తెలిపారు.

A Warning for Coders Zoho CEO Sridhar Vembu s Advice on New Livelihoods here is why

గూగుల్ చాట్ బాట్ తో చిట్ చాట్

అక్కడితో ఆగకుండా ఆ చాట్ ను కూడా షేర్ చేశారు. అక్కడ శ్రమ-రహిత ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి సమాజం అభివృద్ధి చెందుతుందనే దానిపై చర్చించారు. అంతేకాకుండా, తన పనిని విమర్శించమని AI మోడల్‌ను సవాలు చేశారు. ఇది ఒక అత్యంత తెలివైన ఆర్థిక తత్వవేత్తతో వాదించినట్లు ఉందన్నారు. దాని సొంత పనిని కూడా తెలివైన ఆర్ధికవేత్తలా విమర్శించమని అడిగితే దాన్ని అద్భుతంగా చేసిందన్నారు. ఇది ఈ సాంకేతికతను ఎవరు సొంతం చేసుకుంటారు, దానిపై ఎవరు అద్దె వసూలు చేస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+