హైబీపీ పేషెంట్ల కోసం ఏఐ చాట్ బాట్ మెడికేజెంట్.. ఏం చెయ్యాలో అన్నీ చెప్తుంది!
అధిక రక్తపోటు ఇది ప్రస్తుత సమాజంలో అతి పెద్ద సమస్య. హై బీపీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ప్రాణాల మీదకు తెస్తుంది. దీనిని అసలు నిర్లక్ష్యం చేయకూడదు. అధిక రక్తపోటును నిర్వహించడంలో వ్యక్తులను సహాయపడటానికి AI చాట్‌బాట్‌ను అభివృద్ధి చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ తో పని చేసే ఈ చాట్ బాట్ సాధనాలు తక్షణ మద్దతు ఇవ్వటంతో పాటు హైబీపీపై మనలను ఎడ్యుకేట్ చేస్తాయి.
హైబీపీ పేషెంట్ ల కోసం టెక్స్ట్ ఆధారిత చాట్ బాట్ మెడికేజెంట్
ఇవి వినియోగదారులు తమ పరిస్థితిని సమర్థవంతంగా అర్థం చేసుకోవడంలో మరియు నియంత్రించడంలో సహాయపడటానికి చాలా బాగా పని చేస్తాయి. ప్రస్తుతం మనం గూగుల్ క్లౌడ్ యొక్క Dialogflow ప్లాట్ ఫామ్ ను ఉపయోగించి అభివృద్ధి చేయబడిన టెక్స్ట్ ఆధారిత చాట్ బాట్ అయిన మెడికేజెంట్ గురించి తెలుసుకుందాం. ఇది హైపర్ టెన్షన్ స్వీయ నిర్వహణ కోసం రూపొందించబడిన చాట్ బాట్.

మెడికేజెంట్ బీపీ పేషెంట్స్ కోసం ఏం చేస్తుందంటే
ఇది రక్తపోటును పర్యవేక్షించడం, జీవనశైలి మార్పుల వంటి పనులకు సహాయపడడం, మెడిసిన్స్ ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనే అంశాల గురించి చెప్పడం వంటి పనులను చేస్తుంది. రక్తపోటు మార్పులను ఎప్పటికప్పుడు తెలియజేయడంతో పాటు మెడిసిన్స్ సంబంధించిన రిమైండర్ లను ఈ చాట్ బాట్ అందజేస్తుంది. తీసుకోవలసిన ఆహారానికి సంబంధించి, అలాగే శారీరక శ్రమ చేయాల్సిన విధానాన్ని ఎప్పటికప్పుడు పేషెంట్ కు తెలియజేస్తుంది.
వైద్యరంగంలో కీలక భూమిక పోషిస్తున్న ఏఐ
ఆరోగ్య సంరక్షణకు సంబంధించి కోచ్ లతో కమ్యూనికేషన్ ను సులభతరం చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అభివృద్ధి చేసిన ఇటువంటి అనేక చాట్ బాట్ లు ప్రస్తుత వైద్యరంగంలో కీలక భూమిక పోషిస్తున్నాయి. ఒక్క హైపర్ టెన్షన్ మాత్రమే కాకుండా, అనేక వ్యాధులకు సంబంధించి, రోగులకు సహాయకారిగా ఉంటున్నాయి.
చికిత్సలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ కీలకం
వైద్యులకు, ఆపరేషన్లలో కూడా ఎన్నో అద్భుతాలను చేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అభివృద్ధి చేసిన సాంకేతికతలు దోహదం చేస్తున్నాయి. మారుతున్న కాలంతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకు పోతున్న నేటి రోజుల్లో అనేక రోగాలకు చికిత్సలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ పాత్ర కీలకంగా మారింది.












Click it and Unblock the Notifications