ఏఐ దూకుడుకు ఉద్యోగులు సిద్దంగా లేరు.. ! తేల్చేసిన బిల్ గేట్స్..!

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేథ (ఏఐ) దూసుకొస్తోంది. ముఖ్యంగా కృత్రిమ మేథ రాకతో ఉద్యోగాలు వేగంగా ఆవిరైపోతున్నాయి. సంస్దలు కూడా ఏఐ వాడకంతో ఉద్యోగుల సంఖ్య తగ్గించుకోవాలని, తద్వారా లాభాలు పెంచుకోవాలని చూస్తున్నాయి. ఇలాంటి సమయంలో కృత్రిమ మేతలో నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా ఉద్యోగాలు కాపాడుకునేందుకు ఉద్యోగులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. అలాగే కొత్తగా ఉద్యోగాలు వెతుక్కుంటున్న వారి పరిస్ధితి కూడా దారుణంగా మారుతోంది.

ఈ నేపథ్యంలో ఏఐ రాకతో తలెత్తుతున్న సమస్యల్ని నిశితంగా గమనిస్తున్న మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్.. కీలక సీఎన్ఎన్ కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. కృత్రిమ మేథ మనం మెరుగ్గా పనిచేయడానికి స్వేచ్ఛనిస్తుందని, కానీ ఏఐ దూకుడుకు ప్రపంచం సిద్ధంగా లేదని ఆయన విశ్లేషించారు. ఉద్యోగాల్లోకి ఏఐ దూకుడుతో ఉద్యోగులు దానికి అనుగుణంగా సర్దుబాటు కావడానికి తగిన సమయం ఉండదని బిల్ గేట్స్ తెలిపారు.

AI comes so fast you don t have time to adjust it warns bill gates on jobs

ఏఐ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో చూసి తాను ఆశ్చర్యపోతున్నానని బిల్ గేట్స్ తెలిపారు. ముఖ్యంగా కంటెంట్ రాయడం, సాధారణ కోడ్‌లను రూపొందించడం లేదా టెలిసపోర్ట్ అందించడం వంటి మనుషులు ప్రత్యేకంగా భావించే అనేక పనులను ఇది పూర్తి చేయగలదని గుర్తుచేశారు. కస్టమర్ కేర్ లు ఎక్కువగా చాట్ బోట్స్ ను వాడేస్తున్నాయని, కంటెంట్ రైటింగ్, సాధారణ కోడింగ్ ను సైతం ఏఐ టూల్స్ సమర్ధంగా చేస్తున్నాయని తెలిపారు. కాబట్టి టెలిసేల్స్, టెలి సపోర్ట్ వంటి రంగాలు ఏఐతో ముందుగా ప్రభావితం అవుతాయన్నారు.

ఎందుకంటే ఏఐ ఈ పనుల్ని మనుషుల కంటే మరింత ఖచ్చితంగా, తక్కువ ఖర్చుతో చేయగలదని బిల్ గేట్స్ గుర్తుచేశారు. మరోవైపు క్షయవ్యాధి చికిత్సకు కొత్త ఔషధాన్ని అభివృద్ధి చేయడం వంటి మానవులు చేసే అత్యంత సృజనాత్మక పనులు మాత్రం కొనసాగుతాయన్నారు. ఏఐ దూకుడుతో కాలేజ్ గ్రాడ్యుయేట్లు కఠినమైన ఉద్యోగ మార్కెట్‌ను ఎదుర్కోవచ్చని బిల్ గేట్స్ జోస్యం చెప్పారు ఏఐ రాకతో గ్రాడ్యుయేట్లకు కష్టాలు తప్పవన్న అంచనాలను బిల్ గేట్స్ మాటలు అద్ధం పట్టేలా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+