5వేలకు పైగా ఏనుగుల ప్రాణాలు కాపాడిన ఏఐ!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. ఇప్పుడు అన్ని రంగాలలోనూ తన విస్తృతిని తెలియజేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వివిధ రంగాలలో పురోగతిని సాధించడం మాత్రమే కాకుండా, జంతువుల ప్రాణాలను కాపాడడానికి కూడా దోహదం చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రారంభంలో కంప్యూటర్ లో డాక్యుమెంట్లను అభివృద్ధి చేయడానికి, కొన్ని రకాల పనులను చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అని భావిస్తే, కాలక్రమంలో దాని పరిధి చాలా విస్తృతమైనది గా, చాలా గొప్పదిగా కనిపిస్తోంది.
ఏఐ తో సురక్షితంగా 5260 ఏనుగులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తమిళనాడు అడవుల్లో వేలాది ఏనుగుల ప్రాణాలను కాపాడడం అందుకు ఉదాహరణగా కనిపిస్తుంది. తమిళనాడులో అటవీ ప్రాంతాల గుండా రైలు పట్టాల పైన ఏనుగులు మరణిస్తున్న ఘటనలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా తగ్గుముఖం పట్టడం ఏఐ సాధించిన విజయంగా చెప్పవచ్చు. గత 17నెలల కాలంలో మొత్తం 5260ఏనుగులు 1278సార్లు సురక్షితంగా రైలుపట్టాలు దాటి వెళ్లడం వెనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందని అటవీశాఖ మరియు రైల్వేశాఖ అధికారులు చెప్పారు.

ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ తో ఏనుగుల సంరక్షణ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో పాటు మానవ పర్యవేక్షణ ఉండడంతో రైల్వే ట్రాక్ల పై ఏనుగుల ప్రమాదాలను నివారించగలిగామని ఏనుగుల ప్రాణాలను కాపాడటంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగానో దోహదం చేసిందని వారు చెబుతున్నారు. వైల్డ్ లైఫ్ ఎస్ఓఎస్ సంస్థ చెప్పిన వివరాల ప్రకారం గత సంవత్సరం దేశవ్యాప్తంగా దాదాపు 200 ఏనుగులు రైలు ప్రమాదాలలో మరణించాయి.
జంతువుల ప్రాణాలు కాపాడేందుకు రైల్వే తో పాటు అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు
అయితే రైల్వే ట్రాక్ల ప్రక్కన ఏఐ ఆధారిత వ్యవస్థలను ఏర్పాటు చేసి జంతువుల ప్రాణాలను కాపాడడానికి రైల్వే తో పాటు అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా కోయంబత్తూర్ నుండి కేరళకు వెళ్లి కోడలు వారియర్ మార్గాల లోని రైలు మార్గంలో ఈ ప్రయత్నం చేశారు. ఈ ప్రాంతంలో చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ కాగా ఎన్నో ఏనుగులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రాణాలు నిలబెట్టుకున్నాయి.
ఏఐ వ్యవస్థతో కంట్రోల్ రూమ్ కు సమాచారం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకముందు ఈ ప్రాంతాల్లో రైళ్లవేగాన్ని తగ్గించాలని ప్రయత్నం చేసినప్పటికీ, సడన్ గా రైళ్లవేగాన్ని తగ్గించడం సాధ్యం కాలేదు. ఆ అటవీ ప్రాంతంలో రైళ్లు ట్రాక్ దాటి వెళ్లేవరకు శబ్దం చేస్తూ వెళ్లాలని నిర్ణయించినప్పటికీ, అదికూడా అంత ఫలితాలను ఇవ్వలేదు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత, ఏఐ ద్వారా ఎప్పటికప్పుడు జంతువుల యొక్క కదలికలకు సంబంధించిన సమాచారాన్ని ముందే కంట్రోల్ రూమ్ కు చేరవేస్తున్నారు.
లోకో పైలెట్ లకు అలెర్ట్
దీంతో సిబ్బంది ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతున్నారు. జంతువులు రైల్వే ట్రాక్ పై నుండి కాకుండా వేరే మార్గం నుండి వెళ్లడానికి అండర్ పాస్ టన్నెల్స్ ను ఏర్పాటు చేయడం, అలాగే ఏనుగుల కదలికలను 24గంటలు పర్యవేక్షించడానికి ఏఐ ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు రైలు లోకో పైలట్లకు అలర్ట్ పంపడం ద్వారా రైల్ వేగాన్ని తగ్గించి ప్రమాదాలు జరగకుండా చేస్తున్నారు.
ఏఐ ఏనుగుల ప్రాణాలు కాపాడటం శుభ పరిణామం
ఫలితంగా ఎన్నో ఏనుగుల ప్రాణాలను కాపాడగలిగారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానంతో జంతువుల ప్రాణాలను కాపాడగలగటం నిజంగా ఒక అద్భుతం. ఇది మన సాంకేతికతతో సాధించిన విజయం. నిజంగా ఏఐ ఏనుగుల ప్రాణాలు కాపాడటం ఒక శుభ పరిణామం.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications