యూట్యూబ్ లో భారీ మార్పులు
ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. దాదాపుగా అన్ని రంగాల్లో ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటోన్నాయి. మ్యాన్ పవర్ ను తగ్గించుకుంటోన్నాయి. ఈ టెక్నాలజీని టాప్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్ కూడా అందిపుచ్చుకుంటోంది.
ఏఐకి తోడు ఆటోమేటెడ్ కంటెంట్ క్రియేషన్ యూట్యూబ్ లో సరికొత్త పుంతలు తొక్కుతోంది. ఈ టెక్నాలజీకి అనుగుణంగా యూట్యూబ్ భారీ మార్పులకూ శ్రీకారం చుట్టింది. 'కంటెంట్’ అనే పేరుతో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్లాట్ ఫామ్ ను అందుబాటులోకి తీసుకుని వస్తోంది.

ఏఐతో యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్
ఈ టెక్నాలజీ యూట్యూబ్ యూజర్లకు అవసరమైన సమాచారాన్ని, వీడియో లింకులను మరింత వేగంగా అందించడానికి తోడ్పడుతుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బెస్ట్ హవాయ్ వంటి అంశాలకు సంబంధించిన వీడియోలను సైతం రూపొందించవచ్చు.
ఒక్కసారి మనం దీనికి సంబంధించిన ఫీడ్ బ్యాక్ ఇవ్వగలిగితే ప్రపంచవ్యాప్తంగా అందమైన బీచ్ లను ఎంపిక చేసి కంటెంట్‌ను అంతే అందంగా రూపొందిస్తుంది. షాపింగ్, దూర ప్రయాణాలు, ట్రెక్కింగ్ ఇతర కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఏఐ కంటెంట్ ప్లాట్ ఫామ్ ద్వారా పొందవచ్చు.
ఈ టూల్ ద్వారా యూట్యూబ్ వినియోగదారులు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ లేకుండానే కొన్ని రోజులపాటు టెస్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఫాలో-అప్ ప్రశ్నలు, సిఫార్సులు, ఇతర కంటెంట్‌ను యాప్ ద్వారా పొందవచ్చు. ఈ విధానం ద్వారా యూట్యూబ్ వినియోగదారులకు మెరుగైన అనుభవం లభిస్తుందని భావిస్తున్నారు.
సెర్చ్ రిజల్ట్స్ కరోసెల్ పేరుతో మరో ఫీచర్ అందుబాటులోకి రానుంది యూట్యూబ్ లో. వీడియోలతో సంబంధిత అంశాల గురించి సమగ్రంగా తెలుసుకోవడానికి వీలుగా టెక్స్ట్ కూడా ఇందులో ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ అమెరికాలో యూట్యూబ్ ప్రీమియం చందాదారులకు మాత్రమే అందుబాటులో వస్తుంది. ఆ తరువాత క్రమంగా మిగిలిన దేశాలక విస్తరించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications