మన టీచర్లు వెరీ వెరీ పూర్ అండీ బాబు

Artificial Intellegence: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొమ్ములు తిరిగిన కంపెనీలు కూడా దీని బారిన పడుతున్నాయి. భారీగా ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయి. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్.. వంటి సంస్థలు సైతం ఇదివరకే దశలవారీగా లేఆఫ్స్ ప్రకటించాయి.

మరోవంక ఈ టూల్ వినియోగం భారీగా పెరుగుతోంది. దీనిపై సెంటర్ ఫర్ టీచర్ అక్రెడిటేషన్ (CENTA) ఓ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా టీచర్ల వరకు మాత్రమే పరిమితమైన సర్వే ఇది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగంలో వారికి ఎంత వరకు అవగాహన ఉందనే విషయంపై ఈ సర్వే కొనసాగింది.

కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చాయి. 70 శాతం మందికి పైగా ఉపాధ్యాయులు తరగతి గదుల్లో AI టూల్స్‌ను ఉపయోగిస్తోన్నప్పటికీ.. చాలా మందికి ఈ సాంకేతికతపై సరైన అవగాహన లేదు. ఈ సర్వేలో AI టూల్స్‌ను ఉపాధ్యాయులు ఎలా ఉపయోగిస్తున్నారు?, AIపై వారి అభిప్రాయాలు ఏమిటి అనే విషయాలపై దృష్టి సారించారు.

దేశవ్యాప్తంగా 5,000 మందికి పైగా ఉపాధ్యాయులు, ఇతర జీవిత భాగస్వామ్యుల నుండి అభిప్రాయాలను సేకరించారు. ఏఐ టూల్ విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతోంది?, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు దీని గురించి ఏమి ఆలోచిస్తున్నారు అనే దానిపై రెండు జాతీయ సర్వేల ఫలితాలను విడుదల చేసింది CENTA.

AI పట్ల టీచర్లు మరింత అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసిందీ సర్వే. టీచింగ్ లో మూడు సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు ఏఐ టూల్స్ పై ఉన్న అవగాహన మరింత తక్కువే. అనుభవం ఉన్న టీచర్లతో పోల్చుకుంటే టీచింగ్ లో మూడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉన్న ఉపాధ్యాయుల శాతం 75కు ఉంటోంది.

దాదాపు 60 శాతం మంది ఉపాధ్యాయులు పాఠ్య ప్రణాళికలో AI టూల్స్‌ను ఉపయోగిస్తున్నట్లు సర్వే తేల్చింది. మరో 26 శాతం మంది.. తరగతి గదిలో విద్యార్థులకు ఎలాంటి పాఠ్యాంశాలను బోధించాలి? క్లాస్ రూమ్ లో కార్యకలాపాలు ఎలా ఉండాలనే విషయాల గురించి తెలుసుకోవడానికి ఈ టూల్స్ ను ఉపయోగిస్తున్నారు.

AIపై తమకు ఉన్న అవగాహన, సాంకేతిక పరిజ్ఞానంపై 1 నుండి 10 వరకు రేటింగ్ ఇవ్వాలని కోరగా.. 67 శాతం మంది ఉపాధ్యాయులు తమకు తాము 6 లేదా అంతకంటే ఎక్కువ రేటింగ్ ఇచ్చుకున్నారు. సగటు రేటింగ్ 7గా ఉంది. 'AI ఇన్ టీచింగ్'పై CENTA ప్రశ్నించగా.. 57 శాతం మంది మాత్రమే సరైన సమాధానాలు ఇవ్వగలిగారు.

"AI వేగంగా డెవలప్ అవుతోందని, ఉపాధ్యాయుల్లో దీనిపై సరైన అవగాహన ఏర్పడాల్సిన అవసరం ఉందని, వినియోగానికి- అవగాహనకు మధ్య స్పష్టమైన అంతరం ఉందని, ఇది తగ్గాల్సిన అవసరం ఉందని CENTA వ్యవస్థాపకురాలు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమ్య వెంకట్రామన్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+