లేఆఫ్స్ వేళ.. అద్దిరిపోయే వార్త చెప్పిన క్యాప్ జెమిని

Capgemini: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకు దేశీయ ఐటీ రంగంలో భారీగా ఉద్యోగాలు కోల్పోతున్న తరుణంలో.. భారీగా లేఆఫ్స్ తలెత్తుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో క్యాప్‌ జెమినీ ఇండియా గుడ్ న్యూస్ ఇచ్చింది. భారీగా రిక్రూట్మెంట్ డ్రైవ్‌ చేపట్టనున్నట్లు వెల్లడించింది.

ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 40,000 నుండి 45,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తోంది. ఐటీ రంగం నియామకాలలో సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉద్యోగాలకు ఢోకా ఉండట్లేదా సంస్థలో.

Amidst the massive layoffs Capgemini is set to a major recruitment drive in 2025

దీనిపై ది హిందూ బిజినెస్‌ లైన్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం.. ఈ కొత్త నియామకాలలో 35 నుంచి 40 శాతం మంది ఎక్స్ పీరియన్స్ ఉన్న వాళ్లను తీసుకుంటుంది. కీలక డివిజన్లల్లోకి వారిని నియమించాలని భావిస్తోంది. మిగిలిన వాటిల్లో దేశంలో 50కి పైగా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు అంట ఫ్రెషర్స్ తోభర్తీ చేయనుంది.

దీనికోసం క్యాప్‌ జెమినీ ఆయా కళాశాలలతో భాగస్వామ్యం అయింది కూడా. AI- ఆధారిత మ్యాన్ పవర్ ను పెంచడమే సంస్థ ప్రధాన ఉద్దేశం. కొత్తగా చేరేవారికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లో శిక్షణ ఇవ్వాలని కోరుకుంటోంది. తద్వారా వాళ్లు నేరుగా AI ప్రాజెక్టులపై పని చేయడానికి వీలవుతుందని అంచనా వేస్తోంది.

అంతేకాకుండా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అవసరాల కోసం WNSను కొనుగోలు చేయాలని భావిస్తోన్నట్లు ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ తెలిపింది. మ్యాన్ పవర్ పరంగా క్యాప్‌ జెమినీకి ఇది అతిపెద్ద కొనుగోలు కానుంది. దీనికి ఇంకా రెగ్యులేటరీ ఆమోదం లభించాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఆరు నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు.

WNS కు చెందిన ఏజెంటిక్ AI సొల్యూషన్స్‌ ను క్యాప్‌ జెమినీ ఇప్పటికే తన అనలిటిక్స్, కన్సల్టింగ్ డివిజన్ లో మెర్జ్ చేసినట్లు పేర్కొంది. దీనివల్ల ఇంటెలిజెంట్ ఆపరేషన్స్, బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్‌లో కంపెనీ సామర్థ్యాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ కొనుగోలు వల్ల 2027 నాటికి 100 నుండి 140 మిలియన్ డాలర్ల వరకు ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం భారతదేశంలో సుమారు 1.75 లక్షల మంది ఉద్యోగులు ఉన్న క్యాప్‌ జెమినీ ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మైక్రోసాఫ్ట్, టీసీఎస్, ఇంటెల్ వంటి సంస్థలు పెద్ద ఎత్తున లేఆఫ్స్ ప్రకటించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ డ్రైవ్.. ఐటీ రంగంలో చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+