స్టార్ క్రికెటర్ తో మృణాల్ ఠాకూర్ డేటింగ్..! ఇదేం ట్విస్టురా సామి..

స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమాలో సీత క్యారెక్టర్ లో అదరగొట్టారు. ఈ మూవీతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఇటీవల డెకాయిట్ ఒక ప్రేమకథ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. అడివిశేష్ హీరోగా నటించిన ఈ మూవీలో మృణాల్ గుర్తుండిపోయే పాత్రలో కనువిందు చేశారు.

ఆ తర్వాత ఇదే ఏడాది హే జవానీ తో ఇష్క్ హోనా హై అనే సినిమాతో బాలీవుడ్ లోనూ సందడి చేశారు. ప్రస్తుతం పూజా మేరీ జాన్.. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో రాకా మూవీ చేస్తున్నారు. అయితే మృణాల్ ఠాకూర్ పై రోజూ ఏదో ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉంది. ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో మృణాల్ ఠాకూర్ ప్రేమ వ్యవహారం నడుపుతోందని పెళ్లి కూడా చేసుకోబోతుందని రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని మృణాల్ పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు.

అయితే తాజాగా మరో క్రేజీ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. అదేంటంటే..? మృణాల్ ఠాకూర్.. ధనుష్ తో బ్రేకప్ చేసుకుందని ఇప్పుడు ఒక ప్రముఖ స్టార్ క్రికెటర్ తో లవ్ ఎఫైర్ నడుపుతోందని వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆ క్రికెటర్ మరెవరో కాదు.. రిషబ్ పంత్ అట. వీళ్లిద్దరు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఒకరిని ఒకరు ఫాలో అవ్వడమే కారణం అని తెలుస్తోంది.

MrunalThakur tollywood actress dating a star cricketer What a twist social mediarumour goes viral

ఇక పంత్ మాత్రం ఇద్దరు మహిళలను మాత్రమే ఫాలో అవుతున్నాడు. ఒకరు అతని సోదరి కాగా మరొకరు మృణాల్ ఠాకూర్ కావడం గమనార్హం. దేశంలో ఎంతోమంది హీరోయిన్స్ ఉండగా.. పంత్ మాత్రం కేవలం మృణాల్ ను మాత్రమే ఎందుకు ఫాలో అవుతున్నాడు..? అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. అటు వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందని సోషల్ మీడియా కూడా కోడై కూస్తోంది. మరికొన్ని రోజుల్లో ఈ వార్తపై మరింత స్పష్టత రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+