AI: ఏపీలో ఏఐ యూనివర్సిటీ - గేమ్ ఛేంజర్..!!
ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స. ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తోంది. అన్ని ప్రధాన రంగాల్లోనూ దూసుకు వెళ్తోంది. 20వ దశాబ్దపు ఆధునిక సాంకేతికతకు ఏఐ నమూనాగా నిలుస్తోంది. పెరిగిపోతున్న ఏఐ వినియోగం పైన నేటి తరం యువతలోనూ ఆసక్తి పెరుగుతోంది. కూర్పుల్లోనూ డిమాండ్ ఎక్కువగా ఉంది. ఏఐ యూనివర్సిటీల ఏర్పాటు ఇప్పుడు ప్రభుత్వాలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. దీంతో, ఏపీ ప్రభుత్వం అమరావతి వేదికగా ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఎన్వీడాతో ఒప్పందం చేసుకుంది. కీలక రంగాల్లో సేవలను మరింత సులభతరం చేసేలా ప్రణాళికలు అమలు చేస్తోంది.
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యూనివర్సిటీని ఏర్పాటు చేయ నుంది. ఏఐ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఎకో సిస్టమ్, ఇతర అంశాలపై అధ్యయ నం చేయాలని అధికారులకు ప్రభుత్వం దిశ నిర్దేశం చేసింది. ఏఐ వర్సిటీ ద్వారా విద్య, ఆరోగ్యం, గవర్నెన్స్ లాంటి 16 రంగాల్లో సేవలందించే ఆస్కారం ఏర్పడుతుంది. అటు మహారాష్ట్ర ప్రభుత్వం సైతం దేశంలో తొలి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యూనివర్సిటీ మహారాష్ట్రలో ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టు అమలు కోసం వివిధ రంగాల నిపుణులతో ఓ టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసారు. ఈ కమిటీలో ఐఐటీ ముంబై, ఐఐఎం ముంబై డైరెక్టర్లు, గూగుల్ ఇండియా, మహీంద్రా గ్రూప్, ఎల్‌అండ్‌టీ లాంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులు ఉన్నారు.

ఇటు ఏపీ ప్రభుత్వం సైతం అమరావతి కేంద్రంగా ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు వేగంగా అడుగు లు వేస్తోంది. అందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో యువతకు నైపుణ్య శిక్షణ సహా ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించేలా ఏఐ కంప్యూటింగ్ సంస్థ ఎన్విడియా (NVIDIA)తో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా 10,000 మంది విద్యార్థులకు ఏఐలో నైపుణ్య శిక్షణ అందించాలని నిర్ణించారు.
దీంతో పాటు 500 ఏఐ ఆధారిత స్టార్టప్ ల అభివృద్ధి కి దోహదం చేస్తుందని అధికారులు వెల్లడించారు. అందులో భాగంగా ప్రమఖ ప్రయివేటు సంస్థల సమన్వయంతో విద్యార్ధులకు ఏఐ నైపుణ్యాలను అందించాలని డిసైడ్ అయ్యారు. దీని ద్వారా రానున్న రోజుల్లో ఏపీని ఏఐ రీసెర్చ్ అడ్వాన్స్డ్ హబ్ గా తీర్చి దిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ యూనివర్సిటీ ఏర్పాటు జరిగితే ఏపీ భవిష్యత్ కు గేమ్ ఛేంజర్ గా నిలవటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications