ప్రయాణికుల భద్రత కోసం వందే భారత్ రైళ్ళలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్
భారతదేశంలో రైల్వే ప్రగతి పథంలో అడుగులు వేస్తోంది. ప్రస్తుతం వందే భారత్ వంటి ఎక్స్ప్రెస్ రైలును తీసుకువచ్చిన భారతీయ రైల్వే భద్రతను మెరుగుపరచడానికి వందే భారత్ రైళ్లలో ఏఐ సాంకేతికతను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఏ ఐ సాంకేతికతతో ప్రమాదాలను తగ్గించడమే కాకుండా ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడానికి కూడా రైల్వే లక్ష్యంగా చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వినియోగించే పనిలో ఉంది.
AI-ఆధారిత భద్రతా వ్యవస్థ కవచ్
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రైలు కార్యకలాపాలను పర్యవేక్షించడం తో పాటు, రైలు ప్రమాదాలు సంభవించకుండా ముందు వచ్చే సంభావ్య సమస్యలను అంచనా వేయడానికి కూడా రైల్వే ప్రయత్నాలు సాగిస్తోంది. రైల్ కవచ్ అనేది AI-ఆధారిత గుర్తింపు, ఆటోమేటెడ్ హెచ్చరికలతో, రైలు నియంత్రణ చర్యలను సూచిస్తుంది. రైల్వే ట్రాక్‌లపై జంతు ప్రమాదాలను నివారించడానికి రూపొందించబడిన ఒక స్మార్ట్ రైల్వే భద్రతా వ్యవస్థ కవచ్.

ప్రమాదాల నివారణకు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్
ఈ వ్యవస్థ రైలు ప్రయాణ సమయంలో ముందు వచ్చే ప్రమాదాలను వేగంగా పసిగట్టి రైల్వే అధికారులను హెచ్చరిస్తుంది. ఒక జంతువు ట్రాక్‌పై ఉంటే రైళ్ల వేగాన్ని తగ్గిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రైల్వే వ్యవస్థ యొక్క వేగం మరియు ట్రాక్ పరిస్థితులను పర్యవేక్షించటానికి వీలు కలుగుతుంది. అంతేకాదు అసాధారణమైన పరిస్థితులను గురించి ఆపరేటర్లను హెచ్చరిస్తుంది. అవసరమైనప్పుడు జోక్యం చేసుకుని ప్రమాదాలను నివారించడానికి దోహదం చేస్తుంది.
ఏఐ సాంకేతికతతో ప్రయాణికులకు భద్రత
AI సాంకేతికత రియల్-టైమ్ డేటా విశ్లేషణను అందిస్తుంది, ఇది త్వరగా సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. ఇది అంచనా నిర్వహణలో కూడా సహాయపడుతుంది. డౌన్‌టైమ్‌ను తగ్గిస్తుంది . సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రయాణికులు మరింత భద్రతతో కూడిన మరియు నమ్మకమైన ప్రయాణ అనుభవాన్ని పొందవచ్చు.
వందే భారత్ రైళ్లలో AI సక్సెస్ అయితే ప్రపంచానికే మనమో ఉదాహరణ
వందే భారత్ రైళ్లలో AI ని విజయవంతంగా అమలు చేయగలిగితే ప్రపంచవ్యాప్తంగా ఇతర రైల్వే వ్యవస్థలకు ఒక ఉదాహరణగా నిలిచే అవకాశం ఉంది. భారతీయ రైల్వేలు తమ నెట్‌వర్క్ అంతటా ఈ సాంకేతికతను విస్తరించాలని యోచిస్తున్నాయి. భద్రతతో కూడిన మరియు మరింత సమర్థవంతమైన రైల్వే వ్యవస్థ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుందనే భావన ప్రస్తుతం వ్యక్తం అవుతుంది.












Click it and Unblock the Notifications