భవిష్యత్ అంతా AI తోనే- లక్షల వేతనంతో కొలువులు..!!
ఇప్పుడు ఎక్కడ చూసిన ఏఐ హవా కొనసాగుతోంది. ప్రధాన రంగాల్లో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సునామీలా దూసుకొస్తోంది. ప్రభుత్వాలకు ఏఐ వినియోగం.. అందుబాటులోకి తీసుకురావటం ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ఏపీ ప్రభుత్వం ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తోంది. విద్య రంగం లో ఏఐ టూల్స్ వినియోగిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలోనూ ఏఐ వినియోగం కోసం నిర్ణయించింది. ఇక, ఏఐ ద్వారా భారీగా ఉద్యోగాలు కోల్పోతున్నారనే వాదన ఉంది. ఇదే సమయంలో రానున్న రోజుల్లో ఏఐ ఆధారిత కొలువులు లక్షల వేతనంతో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఈ మేరకు కోర్సులకు డిమాండ్ పెరిగింది.
ప్రస్తుతం ఏఐ యుగం నడుస్తోంది. ప్రభుత్వ - ప్రయివేటు రంగంలోనూ ఏఐ వినియోగం పెరిగింది. ఫలితంగా ఏఐ ప్రోత్సాహం ప్రభుత్వాలకు అనివార్యంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలు ఏఐ వినియోగం పైన ఫోకస్ చేసాయి. ఏఐ కారణంగా ఎంఎన్సీ ల్లో భారీగా ఉద్యోగాలు కోల్పోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో వచ్చే ఐదేళ్లలో ఏఐ లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తుందనే ది నిపుణుల మాట. ఏఐ అవసరాన్ని.. ప్రాధాన్యతను గుర్తించిన ఎంతో మంది యువత ఆసక్తి తో కృత్రిమ మేధపై పట్టు సాధించారు. ప్రముఖ కంపెనీల్లో లక్షల ప్యాకేజీలతో కొలువులను దక్కించు కొన్నారు. జేపీ మోర్గాన్, అమెజాన్, గూగుల్‌లాంటి ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్‌షిష్, ఉద్యోగం చేసే అవకాశం దక్కించుకున్నారు.

ఏఐకి ఉన్న ప్రత్యేకతల కారణంగా అంత వేగంగా.. అవసరమైనదిగా మారుతోంది. ఆటోమేషన్ మినహా ఇతర రంగాల్లో ఏఐ వినియోగం విస్తరిస్తోంది. ఫలితంగా ఏఐ కారణంగా ఉపాధి అవకాశాలు పెరగటం ఖాయమని చెబుతున్నారు. జెనరేటివ్ ఏఐ, మిషన్ లెర్నింగ్, డేటా అనాలిటిక్స్ , క్లౌడ్ కంప్యూటింగ్, ఎథికల్ హ్యాకింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ లో నైపుణ్యం ఉంటే లక్షల్లో వేతనాలు పొందే అవకాశం ఉందనేది నిపుణుల సూచన. అదే విధంగా ఏఐ వినియోగించే ఏ సంస్థకు అయినా వాటిని నిర్వహించేందుకు ప్రాంప్టర్లు అవసరం. దీంతో, ఈ స్కిల్స్ నేర్చుకోవటం ద్వారా భారీ వేతనాలను ఆఫర్ గా అందుకొనే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో సాఫ్ట్ వేర్ తో పాటుగానే తయారీ, లాజిస్టిక్ తో పాటుగా ఇతర రంగాల్లోనూ ఏఐ కీలక పాత్ర పోషించనుంది. దీంతో, ఇంజినీరింగ్ చేస్తూనే AI టెక్నాలజీ నేర్చుకుని ఉద్యోగ అవకాశం పొందేందుకు యువత ఆసక్తి చూపుతోంది.












Click it and Unblock the Notifications