EPFO: UAN యాక్టివేషన్‌కు సరికొత్త రూల్! ఎట్టకేలకు ఓపెన్ అయిన పాస్‌బుక్
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) చందాదారులకు ఒక పెద్ద ఊరట లభించింది. గత దాదాపు రెండు వారాలుగా సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిన EPFO 'పాస్‌బుక్ పోర్టల్' సేవలు ఎట్టకేలకు పునరుద్ధరించారు. దీంతో పీఎఫ్ ఖాతాదారులు మళ్లీ పోర్టల్‌లోకి లాగిన్ అయి తమ ఖాతాలోని సెవింగ్స్, స్టేట్‌మెంట్లను చూసుకునే అవకాశం కలిగింది. సిస్టమ్ మెయింటెనెన్స్ కారణంగా జూన్ చివరి వారం నుంచి ఈ సేవలు నిలిచిపోయాయి. వాస్తవానికి జూన్ 29 నాటికే ఈ పనులు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ, సాంకేతిక మార్పుల తీవ్రత దృష్ట్యా ఈ పునరుద్ధరణ ప్రక్రియకు ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పట్టింది.
జులై 15 నుంచివడ్డీ జమ.. అందుకే ఈ తొందర!
EPFO పాస్‌బుక్ పోర్టల్ అందుబాటులోకి రావడం ప్రస్తుత తరుణంలో ఎంతో కీలకంగా మారింది. ఎందుకంటే, ఆర్థిక సంవత్సరం 2025-26కు సంబంధించిన 8.25 శాతం వార్షిక వడ్డీని జులై 15 నుంచి చందాదారుల ఖాతాల్లో జమ చేసేందుకు EPFO సిద్ధమవుతోంది. తమ ఖాతాల్లో వడ్డీ డబ్బులు పడ్డాయో లేదో వెరిఫై చేసుకోవడానికి కోట్లాది మంది సభ్యులకు ఈ పాస్‌బుక్ యాక్సెస్ అత్యంత అవసరం.

ప్రస్తుతం పోర్టల్‌లో రిసెంట్ ట్రాన్సాక్షన్స్ వివరాలు అందుబాటులో ఉన్నాయని, పాత సంవత్సరాల డేటా మైగ్రేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని సంస్థ తెలిపింది. రాబోయే కొద్ది రోజుల్లో పాత వివరాలు కూడా ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతాయని, దీని కోసం సభ్యులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంస్థ స్పష్టం చేసింది.
UAN యాక్టివేషన్‌లో భారీ మార్పు.. వెబ్ సైట్‌లో ఇక కుదరదు!
సాంకేతిక వ్యవస్థను మరింత భద్రంగా, వేగంగా మార్చేందుకు జులై 3 నుంచి సరికొత్త 'యూనిఫైడ్ మెంబర్ పోర్టల్'ను EPFO దశలవారీగా అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ సరికొత్త అప్‌గ్రేడ్‌తో పాటు చందాదారులకు ఒక కీలక మార్పును కూడా పరిచయం చేసింది. ఇప్పటివరకు వెబ్‌సైట్ (యూనిఫైడ్ పోర్టల్) ద్వారా చేసుకునే యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేషన్ సదుపాయాన్ని EPFO పూర్తిగా నిలిపివేసింది.
ఇకపై సభ్యులు తమ యూఏఎన్‌ను కేవలం 'ఉమంగ్' (UMANG) మొబైల్ యాప్ ద్వారా మాత్రమే యాక్టివేట్ చేసుకోవడానికి వీలుంటుంది. అది కూడా ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ (Face Authentication Technology - FAT) ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని పోర్టల్‌లో అధికారిక నోటీసును ఉంచారు. ఏదేమైనా, పాస్‌బుక్ పోర్టల్ తిరిగి ఆన్‌లైన్‌లోకి రావడంతో పీఎఫ్ చందాదారులు తమ నెలవారీ కాంట్రిబ్యూషన్ హిస్టరీని మరియు రాబోయే వడ్డీ క్రెడిట్లను నిరంతరం పర్యవేక్షించుకునే వీలు కలిగింది.














Click it and Unblock the Notifications