AI టూల్స్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..?
డేటా గోప్యత, సమాచార భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈరోజు (2025 డిసెంబర్ 21న ) కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ (Finance Ministry) ఒక ముఖ్యమైన ఆదేశాన్ని జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు తమ అధికారిక విధుల్లో ChatGPT, DeepSeek వంటి నియంత్రణలేని కృత్రిమ మేధస్సు (AI) టూల్స్‌ను ఉపయోగించరాదని స్పష్టంగా ఆదేశించింది. ప్రభుత్వానికి చెందిన పరికరాలు, కంప్యూటర్ సిస్టమ్స్, నెట్‌వర్క్‌లలో ఈ AI టూల్స్ వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు వెల్లడించింది.
డేటా లీకేజీపై కేంద్రం ఆందోళన..
ఈ నిర్ణయానికి ప్రధాన కారణం ప్రభుత్వ డేటా గోప్యత, జాతీయ భద్రత అని కేంద్రం స్పష్టం చేసింది. నియంత్రణ లేని లేదా విదేశీ సర్వర్లపై పనిచేసే AI టూల్స్‌లో సున్నితమైన సమాచారం నమోదు చేయడం వల్ల ప్రభుత్వ రహస్యాలు, పాలసీ డాక్యుమెంట్లు, ఆర్థిక వివరాలు, రక్షణ సంబంధిత సమాచారం లీక్ అయ్యే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించింది. ప్రభుత్వ ఉద్యోగులు తెలియకుండానే అధికారిక సమాచారం AI టూల్స్‌లో ఎంటర్ చేస్తే, అది శాశ్వతంగా సర్వర్లలో నిల్వ ఉండే అవకాశం ఉందని, తద్వారా దేశ భద్రతకు ముప్పు ఏర్పడే పరిస్థితులు తలెత్తవచ్చని పేర్కొంది.

అధికారిక పనుల్లో కఠిన మార్గదర్శకాలు..
- ప్రభుత్వ సమాచారాన్ని పూర్తిగా సురక్షితంగా ఉంచడమే లక్ష్యంగా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్రం తెలిపింది.
- ఉద్యోగులు AI ఆధారిత సేవలను అధికారిక పనుల కోసం అత్యంత జాగ్రత్తగా మాత్రమే ఉపయోగించాలని
- ప్రభుత్వం అనుమతించిన, సురక్షితమైన డిజిటల్ టూల్స్‌కే పరిమితమవ్వాలని
- డేటా భద్రతా నియమావళి (Cyber Security Protocols) తప్పనిసరిగా పాటించాలని సూచించింది
- దేశానికి సంబంధించిన సమాచారం రక్షించడం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత అని కేంద్రం ఈ సందర్భంగా గుర్తు చేసింది.
భవిష్యత్తులో స్వదేశీ AI ప్రత్యామ్నాయాలు..?
ఇదే సమయంలో ప్రభుత్వం భవిష్యత్తులో దేశీయంగా అభివృద్ధి చేసిన సురక్షిత AI టూల్స్‌ను అధికారిక అవసరాల కోసం తీసుకురావాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో, దేశ డేటా దేశంలోనే నిల్వ ఉండేలా రూపొందించిన AI ప్లాట్‌ఫార్మ్‌లపై దృష్టి సారిస్తున్నట్లు అధికారులు సంకేతాలు ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో సైబర్ భద్రతా నిపుణులు సామాన్య ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు.
వ్యక్తిగత వివరాలు, ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా సమాచారం, ఫోటోలు, వీడియోలు.. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డేటా వంటి సున్నితమైన సమాచారాన్ని AI టూల్స్‌లో ఎలాంటి పరిస్థితుల్లోనూ అప్‌లోడ్ చేయవద్దని సూచించారు. ఇలా చేయడం వల్ల డేటా దుర్వినియోగం, గుర్తింపు చోరీ (Identity Theft), సైబర్ మోసాలు జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. కృత్రిమ మేధస్సు వినియోగం వేగంగా పెరుగుతున్న ఈ కాలంలో.. డేటా భద్రత, గోప్యత అత్యంత కీలక అంశాలుగా మారాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. AI టెక్నాలజీ ఎంత ఉపయోగకరమైనదైనా, సరైన నియంత్రణలు లేకుండా వాడితే అది భద్రతా ముప్పుగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications