ఏఐ "గ్రోకిపీడియా" లాంఛ్.. వికీపీడియా కంటే బెటర్ అంటూ సెటైర్ !
బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. వికీపీడియాకు ప్రత్యామ్నాయంగా 'గ్రోకిపీడియా'ను లాంఛ్ చేశారు. కృత్రిమ మేధస్సు ఆధారంగా రూపొందించిన ఈ ప్లాట్‌ఫామ్ నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. మొదట్లో సర్వర్ సమస్యలు తలెత్తినప్పటికీ.. ప్రస్తుతం స్థిరంగా పనిచేస్తున్నట్టు వెల్లడిస్తున్నారు.
గ్రోకిపీడియా విస్తృత వనరుల నుంచి వాస్తవ సమాచారాన్ని సేకరించి.. ఏఐ ద్వారా ప్రాసెస్ చేసి వినియోగదారులకు అందిస్తుంది. ప్రస్తుతం ఇందులో 8,85,000 వ్యాసాలు అందుబాటులో ఉన్నాయి. చాట్‌జీపీటీ లేదా గ్రోక్ వంటి సంభాషణాత్మక ఏఐ మోడల్స్‌కు భిన్నంగా, గ్రోకిపీడియా కీవర్డ్ సెర్చ్ పద్ధతిలో పనిచేస్తుంది. ఉదాహరణకు, 'Barcelona' అని టైప్ చేస్తే దానికి సంబంధించిన సంక్షిప్త సమాచారం కనిపిస్తుంది. కానీ వికీపీడియాను స్వచ్ఛంద మానవులు సవరించి నిర్వహిస్తారు.

ప్రస్తుతం ఉన్న వికీపీడియా వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఎడిటోరియల్, పక్షపాత ధోరణులు ఉన్నాయని.. గ్రోకిపీడియా వాటికి ప్రత్యామ్నాయంగా నిష్పక్షపాతంగా, ధ్రువీకరించిన సమాచారాన్ని మాత్రమే అందిస్తుందని మస్క్ పేర్కొన్నారు. అయితే గ్రోకిపీడియా కంటెంట్‌లో లోపాలు, అసమానతలపై వినియోగదారుల నుంచి విమర్శలు రావడంతో మస్క్ స్పందించారు.
గ్రోకిపీడియా ప్రారంభ దశలో ఉందని.. భవిష్యత్తులో వచ్చే అప్‌డేట్‌లతో కచ్చితత్వం, నమ్మకాన్ని అందిస్తామని ఆయన వివరించారు. ప్రస్తుత వెర్షన్ కంటే రాబోయే 1.0 వెర్షన్ పది రెట్లు మెరుగ్గా ఉంటుందని మస్క్ తెలిపారు. ఈ ప్లాట్‌ఫామ్‌కు ప్రస్తుతం అధికారిక మొబైల్ యాప్‌లు లేనందున, ఎటువంటి థర్డ్‌పార్టీ యాప్‌లను ఉపయోగించవద్దని ఆయన సూచించారు.
వినియోగదారులు grokipedia.com వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ ఎక్స్ ఖాతాతో లాగిన్ అవ్వడం ద్వారా గ్రోకిపీడియాను ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేశారు. అయితే గ్రోకిపీడియా ఇస్తున్న సమాచారం దిగువన "ఈ కంటెంట్ క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్-షేర్‌అలైక్ 4.0 లైసెన్స్ కింద లైసెన్స్ పొందిన వికీపీడియా నుండి స్వీకరించబడింది" అనే డిస్‌క్లెయిమర్‌ను చూపుతుండడం గమనార్హం.
https://t.co/op5s4ZiSwh version 0.1 is now live.
— Elon Musk (@elonmusk) October 28, 2025
Version 1.0 will be 10X better, but even at 0.1 it’s better than Wikipedia imo.
వికీపీడియాను జిమ్మీ వేల్స్, ల్యారీ సాంగర్ కలిసి స్థాపించారు. 2001 జనవరి 15న ఏర్పాటు అయిన ఈ ప్లాట్ ఫామ్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సమాచార వేదికలలో ఒకటిగా నిలిచింది. అంతే కాకుండా ఇది ఒక ఫ్రీ ప్లాట్‌ఫామ్ కావడంతో విశేష ఆదరణ పొందింది. ఎవరైనా సరే సమాచారాన్ని పొందుపరచవచ్చు.. లాగిన్ అయ్యి ఎడిట్ కూడా చేయొచ్చు. దీనిని వికీమీడియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!












Click it and Unblock the Notifications