ఏఐ ప్రభావం ఉండని ఉద్యోగాలివే..! యూత్ కు సాయిరెడ్డి ట్వీట్..!
ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ మేథ ప్రభావం పెరుగుతోంది. ముఖ్యంగా ఏఐ రాకతో పెను మార్పులు చోటు చేసుకుంటుండగా.. ఇందులో భాగంగా ఉద్యోగాలు కూడా భారీగా ఆవిరైపోతున్నాయి. దీంతో ఇంతకాలం టెక్నాలజీపై ఆధారపడిన మానవ వనరుల్లో ఆందోళన అంతకంతకూ పెరుగుతోంది. అంతే కాదు కొత్తగా టెక్నాలజీ వైపు మొగ్గు చూపే వారూ ఆలోచనలో పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏఐ ప్రభావం పడని ఉద్యోగాల వైపు యువత ఆసక్తి పెరుగుతోంది.
ఒకప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించి వైసీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఇదే విషయంపై ఇవాళ ట్వీట్ చేశారు. కృత్రిమ మేధస్సు కారణంగా చాలా ఉద్యోగాలు ఉనికిలో లేకుండా పోతాయని ఆయన తెలిపారు. కానీ ఆతిథ్యం, సంరక్షణ, నర్సింగ్ వంటి కొన్ని ఉద్యోగాలు మానవ సానుభూతి, భావోద్వేగ మేధస్సు, వ్యక్తిగత పరస్పర చర్యపై ఎక్కువగా ఆధారపడతాయని సాయిరెడ్డి తెలిపారు.

There will be many jobs that will become obsolete due to Artificial Intelligence, but there will still be some jobs like hospitality, caregiving and nursing that rely heavily on human empathy, emotional intelligence, and personal interaction, qualities that AI cannot fully…
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 22, 2025
ఏఐ పూర్తిగా ప్రతిబింబించలేని లక్షణాలు ఇవే అని సాయిరెడ్డి వెల్లడించారు. మనం ముందుకు సాగుతున్న కొద్దీ వాటిపై మన దృష్టి ఎక్కువగా ఉండాలంటూ సాయిరెడ్డి యువతకు సలహా ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఆయన ట్వీట్ చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా మన దేశంలోనూ ఏఐ ప్రభావం ఉండని ఉద్యోగాలు వెతుక్కుంటున్న యువతకు ఇది పనికొచ్చేలా ఉంది. దేశ, విదేశాల్లో ఏఐ ప్రభావం పెరుగుతున్న వేళ దాని ప్రభావం పడని ఉద్యోగాల్ని సైతం వెతుక్కోవచ్చని యువతకు సాయిరెడ్డి ఇస్తున్న సలహా ఆసక్తికరంగా ఉంది.












Click it and Unblock the Notifications