Google Gemini AI- ఒక్క ప్రాంప్ట్ ఇస్తే చాలు: హైరిజాల్యూషన్ వీడియోస్ ఇచ్చేస్తుంది
గూగుల్ జెమిని యాప్ ఇప్పుడు సరికొత్త రూపంలోకి మారింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, మ్యాక్ ఓఎస్ ప్లాట్‌ఫారమ్‌లలో ఆరు కీలక ఫీచర్లను ప్రకటించింది. ఈ అప్ డేట్స్ అన్నీ కూడా చాట్‌బాట్‌ను 24/7 డిజిటల్ అసిస్టెంట్‌గా మార్చాయి. యూజర్లు స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లను ఉపయోగించే విధానాలను సమూలంగా మార్చివేశాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లో వీటిని నెక్స్ట్ లెవెల్ ఇన్నోవేషన్స్ గా చెప్పుకోవచ్చు.
గూగుల్ నెక్స్ట్ జెన్ కు సంబంధించిన జెమిని 3.5లో మొదటి మోడల్ 'జెమిని 3.5 ఫ్లాష్' ప్రధానమైనది. మరింత స్పీడ్, మెరుగైన కెపాసిటీ కోసం రూపొందించిన ఫీచర్ ఇది. సంక్లిష్టమైన కోడింగ్, రియల్ టైమ్ ఇష్యూస్ ను చిటికెలో పరిష్కరించడం వంటి పనులను అతి వేగంగా, ఖచ్చితత్వంతో మేనేజ్ చేయగలదీ ఫీచర్.

అదే క్రమంలో గూగుల్ 'జెమిని స్పార్క్'ను ప్రవేశపెట్టింది. ఇది 24/7 పని చేసే పర్సనల్ AI ఏజెంట్. సాధారణ చాట్‌బాట్‌లకు భిన్నం. ఇది మన ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తుంది. మనం హైడ్ చేసి ఉంచిన వివరాలు.. ఉదాహరణకు బ్యాంక్ స్టేట్‌మెంట్లు గానీ, ఫ్యామిలీ ఫొటోలు గానీ, ఇతరత్రా వ్యక్తిగత విషయాలను సెర్చ్ చేస్తుందీ ఫీచర్. ఈమెయిల్స్ లల్లో హైడ్ చేసిన వివరాల కీవర్డ్ ఇస్తే వాటినీ వెలికి తీయగలదు.
స్పార్క్, యాంటిగ్రావిటీ హార్నెస్‌ను ఉపయోగించడం జెమిని 3.5 ప్రత్యేకత. జీమెయిల్, డాక్యుమెంట్స్, స్లైడ్స్ వంటి వర్క్‌స్పేస్ టూల్స్‌తో లింక్ చేయగలుగుతుంది. క్లౌడ్ బేస్డ్ ఏజెంట్ కావడం వల్ల ల్యాప్‌టాప్ షట్ డౌన్ చేసినా, ఫోన్ లాక్ చేసినా స్పార్క్ నేపథ్యంలో పనిచేస్తూనే ఉంటుందని గూగుల్ తెలిపింది.
జెమినిలో మరో కొత్త ఫీచర్.. 'న్యూరల్ ఎక్స్‌ప్రెసివ్'. పూర్తిగా కొత్త విజువల్ లుక్ తో రూపొందింది. ఆకట్టుకునే యానిమేషన్లు, దానికి అవసరమైన కలర్స్, సుదీర్ఘ టెక్స్ట్ బదులుగా ఇంటరాక్టివ్ టైమ్‌లైన్స్, డైనమిక్ గ్రాఫిక్స్‌తో రియల్ టైమ్ రియాక్షన్స్ ఇందులో ఉంటాయి. వెబ్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ లల్లో న్యూరల్ ఎక్స్‌ప్రెసివ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.
మైక్రోఫోన్‌ను తిరిగి రూపొందించింది.. గూగుల్. దీనిద్వారా ఎటువంటి అంతరాయం లేకుండా యూజర్లు మాట్లాడవచ్చు. త్వరలో రీజినల్ లాంగ్వేజెస్ మాత్రమే కాకుండా ప్రాంతీయ మాండలీకాలను కూడా అందుబాటులోకి తెస్తామని గూగుల్ వెల్లడించింది.
'జెమిని ఓమ్ని'.. వీడియో ప్రియుల కోసం రూపొందించిన క్రియేటివ్ టూల్. ఇది సాధారణ టెక్స్ట్ లేదా ఇమేజ్ ప్రాంప్ట్‌లను హైరిజాల్యూషన్ గల సినిమాటిక్ వీడియోలుగా మారుస్తుంది. సంభాషణల ద్వారా యూజర్లు ఫుటేజ్‌ను ఎడిట్ చేయవచ్చు లేదా బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చవచ్చు.
కెమెరా రోల్ నుండి ఫుటేజ్‌ను అప్‌లోడ్ చేసి, సింగిల్ ట్యాప్‌తో ఇన్‌బిల్ట్ టెంప్లేట్‌లను వర్తింపజేసే వెసలుబాటు ఉంది ఇందులో. జెమిని ఓమ్ని Google AI Plus, Pro, Ultra సబ్‌స్క్రైబర్లకు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తోంది.
అలాగే ఇంకో ఫీచర్ 'డైలీ బ్రీఫ్'. గూగుల్ వర్క్ స్పేస్ యాప్ అయినా జీమెయిల్, క్యాలెండర్ వంటివి స్కాన్ చేసే స్మార్ట్ మార్నింగ్ అసిస్టెంట్. ఇది వినియోగదారుల ముఖ్యమైన అప్‌డేట్‌లను ఆటోమేటిక్ గా మేనేజ్ చేయగలదు. మ్యాక్ ద్వారా యూజర్లు ముఖ్యమైన డెస్క్‌టాప్ అప్‌గ్రేడ్ లభించింది. కొత్త డెస్క్‌టాప్ యాప్ లోకల్ ఫైళ్ళ అంతటా వర్క్‌ఫ్లోలను ఆటోమేట్ చేయడానికి స్పార్క్‌ను అనుసంధానిస్తుంది.












Click it and Unblock the Notifications