హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ స్టార్ హీరో కుమార్తె.. ఫస్ట్ లుక్ చూస్తే మతి పోవాల్సిందే..!
టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న హీరో శ్రీకాంత్. కుటుంబ కథా చిత్రాలు, ప్రేమకథా చిత్రాలతో ఆయన చాలా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ఇతర సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ అలరిస్తున్నారు. అయితే శ్రీకాంత్, నటి ఊహ దంపతుల కుమార్తె మేధ మేక త్వరలో వెండితెరపైకి రానున్నట్లు ఆమె హీరోయిన్ గా ఆరంగేట్రం చేస్తుందంటూ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో కథనాలు వచ్చాయి.
అయితే తాజాగా వాటిని నిజం చేస్తూ శ్రీకాంత్ మేధ.. హీరోయిన్ గా తన జర్నీ ప్రారంభించింది. టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థగా ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. ఈ మేరకు కొద్దిసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆ తర్వాత సినిమా పోస్టర్ ను టీమ్ విడుదల చేసింది.
#MythriInLove ♥️A love story that begins with them and finds a place in you!♥️Meet #JaiJasti and #MedhaMeka, the two who’ve won our hearts and are all set to win yours! ✨Happy Falling in Love, Everyone! ❤️Title Revealing Soon!Produced by @MythriOfficial Created by @filmymaheshDirected by @prithvi_vanam
— Mythri Movie Makers (@MythriOfficial) October 12, 2026
సినిమా టైటిల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ మైత్రీ ఇన్ లవ్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్రంలో 'రాజమండ్రి రోజ్ మిల్క్' చిత్రంతో మంచి గుర్తింపు పొందిన జై జాస్తి హీరోగా నటిస్తున్నాడు. అలాగే 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ దర్శకుడు పృథ్వీ వనం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ ఓ పోస్టు పెట్టింది. 'మా మనసులను గెలుచుకున్న ఇద్దరినీ పరిచయం చేస్తున్నాం. ఈ రోజు మీకు వారి పేర్లు తెలుస్తాయి. రేపు వారిని చూసి మీరు కూడా ప్రేమలో పడతారు' అంటూ పోస్టులో పేర్కొంది. అలాగే ఈ చిత్రానికి 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' ఫేమ్ మహేశ్ బాబు పి ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

ఇక మేధా గతంలో అనుష్క నటించిన రుద్రమదేవి చిత్రంలో చిన్నప్పటి రుద్రమదేవి పాత్రలో కనిపించి మెప్పించిన సంగతి తెలిసిందే. మేధాకు చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి ఉంది. ఇక శ్రీకాంత్ కుమారుడు రోషన్ కూడా ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది ఛాంపియన్ సినిమాతో హిట్ కొట్టిన రోషన్ ఇప్పుడు శైలేష్ కొలను దర్శకత్వంలో 'ఏమో ఏమో ఇది' అనే రొమాంటిక్ లవ్ లవ్ స్టోరీ నటిస్తున్నాడు. ఈ మూవీ ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.












Click it and Unblock the Notifications
