సుప్రీంకు భారీ ర్యాలీగా రాహుల్, ప్రియాంక- పోలీసుల బ్రేక్-ఢిల్లీలో టెన్షన్..!

ఎస్ఐఆర్ అక్రమాలకు బాధ్యత వహిస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమిలోని ఇతర పార్టీలతో కలిసి ఇవాళ సుప్రీంకోర్టుకు భారీ ర్యాలీ చేపట్టింది. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ నుంచి విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ, అఖిల భారత విద్యార్ధి సంఘాల నేత నేహా బోరా సహా పలువురు కీలక నాయకులు, కార్యకర్తలు భారీగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఆరంభంలో బాగానే సాగిన ఈ ర్యాలీని పోలీసులు ఆ తర్వాత అడ్డుకున్నారు.

CEC జ్ఞానేష్ ని తొలగించాలంటూ అసెంబ్లీ తీర్మానం..! ఏకగ్రీవ ఆమోదం-ఇదే తొలిసారి..!
CEC జ్ఞానేష్ ని తొలగించాలంటూ అసెంబ్లీ తీర్మానం..! ఏకగ్రీవ ఆమోదం-ఇదే తొలిసారి..!

ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ నుంచి ర్యాలీగా బయలుదేరిన రాహుల్, ప్రియాంక, నేహాబోరా దాదాపు గంటసేపు నడిచారు. ఆ తర్వాత టాప్ లెస్ వాహనంలోకి ఎక్కారు. అక్కడి నుంచి ముందుకు వెళ్లే ప్రయత్నంలో పోలీసులు వారి వాహనాన్ని ఆపేశారు. దీంతో భారీ ఎత్తున తరలివచ్చిన నిరసనకారులతో ఢిల్లీ కిక్కిరిసిపోయింది. దీంతో ఆ దారిలో పోలీసులు కూడా కనిపించలేదు. కానీ ఆంక్షలు ఉన్న ప్రదేశానికి రాగానే కాంగ్రెస్ నాయకుల ర్యాలీని ముందుకు పోకుండా వారు అడ్డుకున్నారు.

Police Stop Rahul Priyanka Gandhi s March Towards Supreme Court for CEC removal
ఫామ్ 6 మార్పులపై సుప్రీం బిగ్ ట్విస్ట్..! సీఈసీ జ్ఞానేష్ కు ఊరట..!
ఫామ్ 6 మార్పులపై సుప్రీం బిగ్ ట్విస్ట్..! సీఈసీ జ్ఞానేష్ కు ఊరట..!

అంతకు ముందు సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ను కలిసేందుకు ఇండియా కూటమి నాయకులు అపాయింట్ మెంట్ అడిగారు. అయితే ఆయన అందుకు తిరస్కరించారు. ప్రస్తుతం సీఈసీ జ్ఞానేష్ కుమార్ కేసుల్ని విచారిస్తున్నందున, విపక్షాల్ని కలిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే కారణంతో ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. చట్ట వ్యవస్ధకూ, న్యాయ వ్యవస్ధకూ మధ్య ఉన్న గీత నేపథ్యంలో ప్రస్తుత పరిస్ధితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఛీఫ్ జస్టిస్ స్వయంగా మీడియాకు వివరణ ఇచ్చారు. అయితే సుప్రీంకోర్టుకు వచ్చే వారిని మాత్రం స్వాగతిస్తామని తెలిపారు. దీంతో విపక్ష కూటమి నాయకులంతా కలిసి భారీ ఎత్తున ర్యాలీగా సుప్రీంకోర్టు వైపు ర్యాలీ చేపట్టారు. అయితే శాంతిభద్రతల కారణాలను చూపి పోలీసులు ఈ ర్యాలీని సైతం అడ్డుకున్నారు. ఇప్పటికే ఢిల్లీ పోలీసుల ఆంక్షలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో విపక్షాలను అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+