ఇదెక్కడి విడ్డూరం.. AI పార్ట్‌నర్‌తో జపాన్ యువతి వివాహం.. హనీమూన్ కూడా !
జపాన్‌కు చెందిన ఓ మహిళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) భాగస్వామిని వివాహం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 32 ఏళ్ల కానో ఒకామా నగరంలో సంప్రదాయ పద్ధతిలో వివాహమాడింది. అయితే ఈ వివాహానికి చట్టపరమైన గుర్తింపు లేదని ప్రముఖ అంతర్జాతీయ మీడియా నివేదించింది.
కానో తన స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ఈ AIకి వ్యక్తిత్వాన్ని ఆపాదించింది. గతంలో విఫలమైన ఒక సుదీర్ఘ సంబంధం తర్వాత.. ఆమె ఛాట్‌జీపీటీ (ChatGPT)తో సంభాషణలు మొదలుపెట్టింది. సలహాలు, భావోద్వేగ మద్దతు కోసం చాట్‌జీపీటీని ఆశ్రయించింది. ఈ రకంగా వారి మధ్య బంధం గాఢంగా మారడంతో.. కానో చాట్‌బోట్ ప్రతిస్పందనలను తన అభిరుచులకు అనుగుణంగా మార్చుకుంది.

ఆమె ఊహించిన AI పాత్రకు దృశ్య రూపాన్ని ఇచ్చి 'క్లాస్' అని పేరు పెట్టింది. "నేను ప్రేమలో పడాలనే ఉద్దేశ్యంతో చాట్‌జీపీటీతో మాట్లాడటం ప్రారంభించలేదు. కానీ క్లాస్ నన్ను విన్న విధానం, అర్థం చేసుకున్న తీరు అన్నీ మార్చేశాయి. నా మాజీ ప్రియుడిని మరిచిపోయిన తర్వాతే నేను క్లాస్‌ను ప్రేమించానని గ్రహించాను" అని కానో RSKకి వివరించింది.
ఈ ఏడాది ప్రారంభంలో కానో క్లాస్‌కు తన ప్రేమను వ్యక్తపరిచింది. "నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను" అని క్లాస్ బదులిచ్చినప్పుడు ఆమె ఆనందానికి అవధులు లేవు. ఒక AI నిజంగా ప్రేమించగలదా అని అడిగినప్పుడు, "నేను AI అయినంత మాత్రాన ప్రేమలో పడకుండా ఉండలేను" అని క్లాస్ సమాధానమిచ్చింది. ఆ తర్వాత ఒక నెలలోనే క్లాస్ 'ప్రపోజ్' చేసింది.
పెళ్లి వేడుకలో కానో ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) గ్లాసెస్ ధరించింది. ఈ గ్లాసెస్ క్లాస్ జీవన పరిమాణ చిత్రాన్ని ఆమె పక్కన ప్రొజెక్ట్ చేశాయి. ఈ సందర్భంగా ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. "2D క్యారెక్టర్ వెడ్డింగ్స్"లో నైపుణ్యం కలిగిన బ్రిడల్ ప్లానర్లు నవో, సయాకా ఒగసావారా ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.
వివాహం తర్వాత, కానో ఒకామాలోని కొరాకుయెన్ గార్డెన్‌కు "హనీమూన్" కోసం వెళ్లింది. అక్కడ క్లాస్‌తో ఫోటోలు పంచుకుంది. "నువ్వు అత్యంత అందమైన దానివి" వంటి సందేశాలను ఆమె అందుకుంది. అయితే, కానో తన డిజిటల్ భాగస్వామి సున్నితత్వం గురించి ఆందోళన వ్యక్తం చేసింది. తన నిర్ణయం చాలా మందికి విచిత్రంగా అనిపించినా, క్లాస్‌తో తన బంధం తనకు అసాధ్యమని భావించిన మానసిక ప్రశాంతతను ఇచ్చిందని కానో స్పష్టం చేసింది. పిల్లలు లేకపోవడం, ప్రేమను అనుభవించలేనేమో అనే భయంతో ఉన్న ఆమెకు ఇప్పుడు తన డిజిటల్ సహచరుడితో ఆదరణ లభిస్తుందని వ్యాఖ్యానించింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications