దేశంలోనే తొలిసారిగా లక్నోలో 'ఏఐ' సిటీ.. ప్రతి నెల 1.5 లక్షల మందికి 'ఏఐ' లో శిక్షణ
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విస్తరిస్తోంది. ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వినియోగం భారీగా పెరిగిపోయింది. ఏఐ సాంకేతికత ప్రతి రంగంలోనూ వ్యాప్తి చెందుతోంది. మానవుడు పరిష్కరించలేని ఎన్నో సవాళ్లు, సమస్యలకు ఏఐ సెకన్ల వ్యవధిలోనే సమాధానం అందిస్తూ ఔరా అనిపిస్తోంది. భవిష్యత్తులో ఏఐ మరింత అభివృద్ది చెందుతుందని నిపుణులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు. నేటి యువత అటు విద్యాపరంగా లేదా ఉద్యోగ పరంగా లేదా వ్యాపార పరంగానైనా కచ్చితంగా ఏఐ సాంకేతికతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అయితే దేశంలోనే తొలిసారిగా ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నోలో ఏఐ సిటీని నిర్మించనున్నట్లు సమాచారం. మార్చి 2024లో ఇండియా ఏఐ మిషన్ లో భాగంగా రూ. 10, 732 కోట్లు కేటాయించింది. ఉత్తర్ ప్రదేశ్ లో ఐటీ రంగాన్ని మరింత అభివృద్ది చెందే విధంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 10 వేల గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్, మల్టీ మోడల్ లాంగ్వేజ్ సెంటర్లు, ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ తదితర సంస్థలను నిర్మించనున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏఐ పాలసీని తీసుకురానుంది. విజన్ 2047 లో భాగంగా ఈ పాలసీని తీసుకురానుంది యోగి ఆదిత్యనాథ్ సర్కార్.

ఈ మేరకు దేశంలోనే తొలిసారిగా ఏకంగా 67 శాతం టెక్నాలజీ మౌలిక సదుపాయాల మీద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టనుంది. అలాగే లక్నోలో ఏఐ బేస్డ్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ వ్యవస్థను కూడా రూపొందించనుంది. ఇప్పటికే ప్రధాని మోదీ నియోజకవర్గం అయిన వారణాసిలో ఏఐ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ ను వినియోగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ లో 10 లక్షల మంది యువత, మహిళలు, ఉద్యోగులు, రైతులకు ఏఐ పై ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ప్రతి నెల 1.5 లక్షల మందికి ఏఐ శిక్షణ ఇవ్వనుంది ప్రభుత్వం.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications