విశాఖ స్కూళ్లలో ఏఐ ల్యాబ్స్ ప్రారంభం-భవిష్యత్తు ఇదేనన్న లోకేష్ ..!
విశాఖపట్నం జిల్లాలో సైయెంట్ ఫౌండేషన్ సహకారంతో 50 ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఏఐ ల్యాబ్స్ ను మంత్రి నారా లోకేష్ ఇవాళ ప్రారంభించారు. నగరంలోని రాడిసన్ బ్లూ రిసార్ట్ లో 50 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్ ను వర్చువల్ గా నారా లోకేష్ ప్రారంభించారు. భవిష్యత్ లో ఏఐ పారిశ్రామిక విప్లపం రాబోతోందని లోకేష్ తెలిపారు. అంతకుముందు విశాఖ చంద్రంపాలెం జడ్పీ హైస్కూల్ లో సైయెంట్ ఏఐ ల్యాబ్స్ ను కూడా ప్రారంభించారు.
విశాఖ రాడిసన్ బ్లూ రిసార్ట్ లో ప్రముఖ ఐటీ సంస్థ సైయెంట్ ఫౌండేషన్ సహకారంతో రూ.8 కోట్లు వెచ్చించి విశాఖ జిల్లా వ్యాప్తంగా 50 ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటుచేసిన ఏఐ ల్యాబ్స్, స్టెమ్, రోబోటిక్స్ ల్యాబ్స్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రోబో సాయంతో వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పెద్దఎత్తున హాజరయ్యారు.

ఏఐ వల్ల మనకేంటి ఉపయోగం అని అందరూ అనుకోవచ్చని, ఇక్కడున్న విద్యార్థులే మన భవిష్యత్ అని లోకేష్ తెలిపారు. గతంలో పారిశ్రామిక విప్లవం వల్ల అనేక మందికి ఉద్యోగాలు వచ్చాయని, ఐటీ వల్ల దేశం, ప్రపంచంలో తెలుగువారికి మెరుగైన అవకాశాలు వచ్చాయన్నారు. ఇప్పుడు ఏఐ ఇండిస్ట్రియల్ రివల్యూషన్ రాబోతోందన్నారు. ఈ ఏఐ వల్ల మన రెగ్యులర్ పనులును టెక్నాలజీ సాయంతో చేయవచ్చని లోకేష్ తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కరిక్యులమ్ లో మార్పులు రావాలన్నాు. ల్యాబ్స్ లో మార్పులు రావాలని ప్రభుత్వం బలంగా నమ్ముతోందన్నారు.

ఏఐ ద్వారా మనం ఎదుర్కొంటున్న ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని లోకేష్ తెలిపారు. ఏఐ టెక్నాలజీ వినియోగించి ఎలాంటి మార్పు తీసుకురావచ్చో మనం ఒక్కసారి ఆలోచించాలన్నారు. చంద్రంపాలెం స్కూల్ లో విద్యార్థులు ఏఐ వినియోగించి నీటిని మొక్కలకు ఏవిధంగా అందించవచ్చో చూపించారు. సాంకేతిక పరిజ్ఞానం ఏవిధంగా మన జీవితాల్లో మార్పు తీసుకువస్తుందో వారు తనకు చెప్పారన్నారు.












Click it and Unblock the Notifications