తారలు దిగివచ్చిన వేళ..
తమిళనాడులో పోలింగ్ ఆరంభమైంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 234 నియోజకవర్గాలకు నేడు ఒకే దశలో ఓటింగ్ జరుగుతోంది. డీఎంకే, ఏఐఏడీఎంకే, టీవీకే.. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలిచి తీరాలనే పట్టుదలతో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించాయి. దీనికి అనుగుణంగా వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకున్నాయి. టీవీకే పూర్తిస్థాయిలో ఎన్నికల బరిలో నిల్చోవడం వల్ల త్రిముఖ పోరు ఏర్పడింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ హోరాహోరి పోరు నెలకొంది. ఈ పోరులో విజేత ఎవరనేది మే 4వ తేలుతుంది.
తొలి రెండు గంటల్లోనే కోలీవుడ్ కు చెందిన పలువురు స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఎండ తీవ్రత అధికంగా ఉంటోండటం వల్ల తొలి రెండు గంటల్లోనే వారంతా పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరి నిల్చున్నారు. తమవంతు వచ్చేంత వరకు వేచివుండి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు.

మక్కల్ నీథి మయ్యం అధినేత, రాజ్యసభ సభ్యుడు, బహుభాషా నటుడు కమల్ హాసన్ ఓటు వేశారు. తన కుమార్తె, ప్రముఖ నటి, గాయకురాలు శృతి హాసన్ తో కలిసి ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఓటర్లతో పాటు క్యూలో నిల్చొని ఓటువేశారు. సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్, సౌందర్య రజినీకాంత్ ఓటు వేసిన వారిలో ఉన్నారు. టీవీకే అధినేత విజయ్, రాక్ స్టార్ అనిరుధ్ రవిచంద్రన్ వంటి అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్టార్ హీరో అజిత్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నటుడు-నిర్మాత శివకార్తికేయన్ సతీమణి ఆర్తితో పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఇటీవల రెండో బిడ్డకు తండ్రైన దర్శకుడు అట్లీ ఉదయాన్నే ఓటేశారు. దర్శకుడు-నటుడు శశికీళ తన స్వగ్రామంలో ఉదయం 7:15 గంటలకే ఓటేశారు. నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్, నటుడు కరుణాస్, గాయని గ్రేస్, దర్శకుడిగా అరంగేట్రం చేసిన కుమారుడు కెన్ సైతం త ఓటు హక్కును వినియోగించుకున్నారు. నట దర్శకుడు ఆర్జే బాలాజీ, హీరో జై చెన్నైలో సామాన్య పౌరులతో పాటు క్యూలో నిలబడి ఓటు వేశారు. యువనటుడు గౌతమ్ కార్తిక్ తన ఓటు వేసిన అనంతరం, ప్రతి ఒక్కరూ ఈ బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. హరీష్ కళ్యాణ్ కూడా ఓటు వేసిన వారిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications