అల్లు అర్జున్ నుంచి బిగ్ అప్ డేట్
ఐకన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్' సినిమా విడుదలై నేటితో సంవత్సరం పూర్తి చేసుకుంది. టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి తెలియజేసిన మూవీ ఇది. బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా 1,800 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిందీ ఫిల్మ్. ఇప్పటికీ దాని ప్రకంపనలు తగ్గట్లేదు. సంవత్సరం దాటిపోయినా కలెక్షన్లల్లో దీన్ని క్రాస్ చేయడం కాదు కదా.. కనీసం దరిదాపులకూ వెళ్లే బొమ్మ ఇంతవరకూ పడలేదు.
2021లో 'పుష్ప: ది రైస్' బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ ఇది. రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, జగపతిబాబు, రావు రమేష్, తారక్ పొన్నప్ప తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఏడాది పూర్తయిన సందర్భంగా అల్లు అర్జున్ నుంచి బిగ్ అప్ డేట్ వెలువడింది. ఈ మూవీ.. మర్చిపోలేని ప్రయాణం అంటూ తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ షేర్ చేశాడు. దర్శకుడు సుకుమార్‌తో కలిసి ఓ వర్కింగ్ స్టిల్ ను దీనికి జత చేశాడు.

'పుష్ప' చిత్రం కోసం పని చేసిన తమ అందరి జీవితాల్లో అయిదేళ్ల పాటు సాగిన ఈ ప్రయాణం మరిచిపోలేదని అల్లు అర్జున్ చెప్పాడు. ఈ సినిమాకు కోట్లాదిమంది ప్రేక్షకుల నుండి లభించిన అపారమైన ప్రేమ, బలం, ధైర్యం తమకు ఎంతగానో స్ఫూర్తినిచ్చిందని వెల్లడించాడు. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ఈ సినిమాను ఒక సంచలనంగా మార్చడంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞులై ఉంటామని వ్యాఖ్యానించాడు.
ఈ అద్భుత ప్రయాణంలో తమతో పాటు అడుగేసిన కళాకారులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, మొత్తం యూనిట్ సభ్యులు, నిర్మాతలు, పంపిణీదారులు.. వీరిందరితో కలిసి పనిచేయడం తమకు ఎంతో గౌరవమని వివరించాడు. ముఖ్యంగా 'కేప్టెన్' ఆర్య సుకుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశాడు అల్లు అర్జున్. ఈ విజయవంతమైన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ మరోసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నాడు.












Click it and Unblock the Notifications