ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ "డ్రాగన్" మూవీలో బాలీవుడ్ సీనియర్ స్టార్..
గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. జూన్ 25, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ మూవీ టైటిల్ ఇంకా రివీల్ చేయకపోయినా.. ఈ సినిమా టైటిల్ "డ్రాగన్" అంటూ ప్రచారం నడుస్తోంది. అలానే ఈ సినిమాలో మలయాళ సీనియర్ నటులు బిజూ మీనన్.. యంగ్ హీరో టోవినో థామస్ కూడా నటిస్తున్నారు. కాగా కొన్ని రోజులుగా ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ స్టార్ కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ ఆయనే అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

బాలీవుడ్ స్టార్..?
కాగా బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వాటిని ధ్రువీకరిస్తూ అనిల్ కపూర్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో స్టోరీ పెట్టారు. అందులో మూవీ పోస్టర్‌ను పంచుకున్న ఆయన 'ఒక సినిమా వచ్చేసింది మరో రెండు లైనప్‌లో ఉన్నాయంటూ పేర్కొన్నారు. అయితే ఎన్టీఆర్‌తో కలిసి అనిల్ కపూర్ నటిస్తున్న రెండో మూవీగా ఇది నిలవనుంది. రీసెంట్ గానే వీరిద్దరూ "వార్ 2" లో కలిసి యాక్ట్ చేశారు. అయితే అనిల్ కపూర్ ఏ పాత్రలో కనిపిస్తారు అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ఓ వైపు ఆర్ఆర్ఆర్, దేవర చిత్రాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు తారక్. మరోవైపు కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్ చిత్రాల్లో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన ప్రశాంత్ నీల్ ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుండడంతో మూవీపై భారీ అంచనాలు నెలకున్నాయి. అంతే కాకుండా ఈ సినిమా కోసమే ఎన్టీఆర్ బక్కచిక్కారు. మరీ ఈ మూవీతో ప్రేక్షకులను అలరిస్తారో లేదో చూడాలి.













Click it and Unblock the Notifications