Chiranjeevi: భావోద్వేగానికి గురైన చిరంజీవి
కోట్లాది మంచి అభిమానుల ఆరాధ్య దైవం చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. అంతేకాదు.. తన సంతోషాన్ని, ఆనందాన్ని కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. కొడుకు రామ్ చరణ్, కోడలు ఉపాసనకు జన్మించిన కవల పిల్లలకు శివరాం, అన్వీరాదేవి అని పేర్లు పెట్టిన సంగతి తెలిసిందే. ఇది రామ్ చరణ్ తీసుకున్న నిర్ణయం.
శివరాం అంటే.. కొణిదెల శివంకరవరప్రసాద్ అనే చిరంజీవి అసలు పేరులో శివ అని తీసుకొని దానికి రాముడి పేరు జోడించి శివరాం అని పెట్టారు. అలాగే అమ్మాయికి అన్వీరా దేవి అని పెట్టారు. అంటే చిరంజీవి తల్లి పేరు అంజనాదేవి కాగా, అందులో దేవి తీసుకొని అన్వీరా తర్వాత జోడించి అన్వీరాదేవి అని పెట్టారు. ఇలా కొడుకు పెట్టిన పేర్లు చిరంజీవిని తీవ్ర భావోద్వేగానికి గురిచేశాయి.

బారసాల నిర్వహించి పేరు పెట్టారు
మన పురాతన సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవిస్తూ, పెద్దలను గౌరవిస్తూ, వారి పేరు నిలబెట్టేలా ఇటువంటి పేర్లు పెట్టడంపై చిరంజీవి, సురేఖ సంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇంటికి కొన్ని వందల ఫోన్ కాల్స్ వస్తున్నాయని, మెసేజ్ లు అయితే వరదలా వస్తున్నాయని, అభిమానుల ప్రేమ, ఆశీర్వాదం చూస్తుంటే తన హృదయం ఉప్పొంగిపోతోందని, ఈ జన్మకు ఇది చాలు అనిపిస్తోందని చిరు అన్నారు. ఈ నెల 11వ తేదీన కవల పిల్లలకు బారసాల నిర్వహించి నామకరణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఇరువైపులా కుటుంబ పెద్దలు పాల్గొన్నారు. చిరంజీవి తనకు వారసుడు జన్మించాడని పొంగిపోతున్నారు.
ప్రయోజకుడైన కొడుకును చూసి..
ముందుగా క్లింకార అనే పాప రామ్ చరణ్, ఉపాసన దంపతులకు జన్మించింది. తర్వాత అందరూ ఆ ఒక్క పాపతోనే సరిపెడతారేమో అనుకున్నారు. కానీ అనూహ్యంగా కవల పిల్లలకు జన్మనివ్వడం, అందులో మగపిల్లవాడు పుట్టడంతో చిరంజీవి కుటుంబంలో ఆనందానికి అంతులేకుండా పోయింది. తమకు వారసుడొచ్చాడుని, తమ తండ్రే అలా జన్మించాడని చిరంజీవి సోదరులు భావిస్తున్నారు.
ఏదేమైనప్పటికీ ఎంతో సాంప్రదాయబద్దంగా, పెద్దలపై గౌరవంతో రామ్ చరణ్ దంపతలు తీసుకున్న నిర్ణయం మాత్రం చిరంజీవి మనసును భావోద్వేగానికి గురిచేసిందని చెప్పొచ్చు. పుత్రుడు జన్మించినప్పుడు కాదు.. ఆ పుత్రుడు ప్రయోజకుడైనప్పుడు ఆ తండ్రికి నిజమైన ఆనందం అన్నట్లుగా, రామ్ చరణ్ ను చూసి చిరు పొంగిపోతున్నారు.












Click it and Unblock the Notifications