‘ధురంధర్2’ దెబ్బకు ‘పుష్ప2’ రికార్డులు గల్లంతు

రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులు సృష్టిస్తోంది. సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్ డ్రామా, విడుదలైన ఏడో రోజే సరికొత్త చరిత్ర సృష్టించి, ట్రేడ్ వర్గాలను విస్మయపరిచింది. కేవలం హిందీ వెర్షన్‌లో బుధవారం ఒక్కరోజే దాదాపు 47 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి, మొదటి బుధవారం అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ఇండియన్ సినిమాగా రికార్డులకెక్కింది. గతంలో ఏ హిందీ సినిమా కూడా ఈ స్థాయి ప్రభంజనాన్ని సృష్టించలేదు.

పాత రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి

'ధురంధర్' స్పీడ్‌కు బాక్సాఫీస్ రికార్డుల సమీకరణాలు మారిపోతున్నాయి. ఇప్పటివరకు మొదటి బుధవారం అత్యధిక వసూళ్లలో అగ్రస్థానంలో ఉన్న విక్కీ కౌశల్ హిస్టారికల్ మూవీ 'ఛావా' (రూ.32.40 కోట్లు) ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయింది. అలాగే, సన్నీ డియోల్ నటించిన 'గదర్ 2' (రూ.32.37 కోట్లు) మూడో స్థానానికి పరిమితమైంది. రణ్‌వీర్ సింగ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, ఆదిత్య ధర్ టేకింగ్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుండటంతో పాత రికార్డులన్నీ తుడిచి పెట్టుకుపోతున్నాయి.

Dhurandhar 2 The blockbuster movie has overtaken every milestone set by Allu Arjun Pushpa 2

అన్నింటికన్నా అతి పెద్ద ఆశ్చర్యం

అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ రికార్డుల దెబ్బకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' టాప్-3 నుండి కిందికి పడిపోయింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప 2: ది రూల్' హిందీ వెర్షన్ బుధవారం నాడు రూ.31.50 కోట్లు వసూలు చేసి మూడో స్థానంలో ఉండేది, కానీ ఇప్పుడు ధురంధర్ 2 ధాటికి నాలుగో స్థానానికి పడిపోయింది. రణ్‌బీర్ కపూర్ నటించిన 'యానిమల్' (రూ.30.45 కోట్లు) ఈ జాబితాలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. పుష్ప వంటి భారీ పాన్-ఇండియా సినిమా రికార్డునే రణ్‌వీర్ సింగ్ బ్రేక్ చేయడం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి, 'ధురంధర్ 2' కేవలం ఒక స్పై థ్రిల్లర్‌గానే కాకుండా బాక్సాఫీస్ వద్ద ఒక కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్ల లెక్కలు చూస్తుంటే, రాబోయే రోజుల్లో మరిన్ని భారీ రికార్డులను తిరగరాయడం ఖాయమనిపిస్తోంది. లాంగ్ రన్‌లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+