మహేష్‌బాబు మెయింట్‌నెన్స్ ఖర్చు రోజుకు ఎంతో తెలుసా?

టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు వయసు కేవలం నెంబర్ మాత్రమే అని మనందరికీ తెలిసిందే. హాఫ్ సెంచరీకి చేరువవుతున్నా.. నేటి తరం యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తూ ఎల్లప్పుడూ 25 ఏళ్ల కుర్రాడిలా మెరిసిపోతుంటారు. అందుకే మహేష్ బాబు ఫిట్‌నెస్, డైట్, గ్లోయింగ్ స్కిన్ కేర్ వెనుక ఉన్న రహస్యం ఏంటా అని అభిమానులతో పాటు సాధారణ జనాల్లోనూ ఎప్పుడూ ఆసక్తికర చర్చ జరుగుతూనే ఉంటుంది. ఫిలిం నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. మహేష్ బాబు తన లుక్, లగ్జరీ లైఫ్‌స్టైల్ మెయింటెనెన్స్ కోసం భారీగానే ఖర్చు చేస్తారట. ఆయన ఫిట్‌నెస్ కోసం ప్రపంచ ప్రసిద్ధ ట్రైనర్ మినేష్ మురుగన్ పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంటారు. అలాగే ఆయన పర్సనల్ జిమ్ కోసం అత్యంత ఖరీదైన అత్యాధునిక విదేశీ పరికరాలను వాడుతుంటారు.

ప్రొటీన్లు ఎక్కువ, కార్బొహైడ్రేట్లు ఎక్కువ

ఆయన రోజూ తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు తక్కువగా, ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకుంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక పర్సనల్ చెఫ్ ఉంటారు. బ్రౌన్ రైస్, చికెన్, బ్రోకలీ, ఫిష్ వంటి ఆర్గానిక్, న్యూట్రిషియన్ ఫుడ్ మాత్రమే తీసుకుంటారు. స్కిన్ గ్లో కోసం విదేశీ బ్రాండ్ల హై-ఎండ్ కాస్మెటిక్స్, రెగ్యులర్ హైడ్రేషన్ థెరపీలు, వరల్డ్ క్లాస్ కాస్ట్యూమ్స్ వాడుతుంటారు. వీటన్నింటి కోసం సూపర్ స్టార్ రోజుకు సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చు చేస్తారని ఇండస్ట్రీ టాక్. అంటే కేవలం తన పర్సనల్ లైఫ్‌స్టైల్, లుక్ మెయింటెనెన్స్ కోసమే నెలకు దాదాపు రూ.1 కోటి వరకు ఖర్చవుతుందన్నమాట!

Mahesh Babu Daily Maintenance Cost The Price of a Superstar Lifestyle

యాక్షన్ అడ్వెంచర్ కోసం

ప్రస్తుతం మహేష్ బాబు గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అడ్వెంచర్ సినిమా #SSMB29 కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ కథాంశంతో రూపుదిద్దుకుంటోంది. ప్రముఖ ఆఫ్రికన్ నవలా రచయిత విల్బర్ స్మిత్ పుస్తకాల ఆధారంగా విజయేంద్ర ప్రసాద్ ఈ కథను సిద్ధం చేశారు. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ కోసం హాలీవుడ్‌కు చెందిన టాప్ స్టంట్ ఏజెన్సీలు పని చేయబోతున్నాయి. దీనికోసం మహేష్ బాబు జర్మనీతో పాటు పలు దేశాల్లో ప్రత్యేకంగా ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసమే మహేష్ బాబు గతంలో ఎన్నడూ లేని విధంగా పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో ఒక రగ్గడ్ హాలీవుడ్ అడ్వెంచరర్ లుక్‌లోకి మారిపోయారు. ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కోసం, గ్లోబల్ స్క్రీన్‌పై టాలీవుడ్ జెండా ఎగరేయడం కోసం సూపర్ స్టార్ ఈ రేంజ్‌లో కష్టపడటం, ఖర్చు పెట్టడం కచ్చితంగా గర్వించదగ్గ విషయమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+